తల్లితో గొడవ పడి ఓ యువకుడు కాల్వలోకి దూకాడు. కృష్ణా జిల్లా గుడివాడ మండలం లింగవరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఇలాపర్తి నాగబాబు అనే యువకుడు ట్రాక్టర్ డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. శనివారం రాత్రి ఇంటికి భోజనం చేస్తున్న సమయంలో తల్లితో గొడవ పడటంతో, తీవ్ర మనస్తాపానికి గురై కోపంతో గ్రామంలో ప్రవహిస్తున్న చంద్రయ్య కాల్వ వంతెన పైనుండి దూకాడు. సమాచారం అందుకున్న గుడివాడ రూరల్ పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటన ప్రాంతానికి చేరుకొని, గాలించిన్నప్పటికి జాడ దొరకలేదు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు శోక సముద్రంలో మునిగారు.
ఇదీ చదవండీ...లైవ్: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. సింహవాహన సేవ