తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం పడమటిగూడెం శివారు బస్తారాం తండాకు చెందిన సురేశ్ అనే రైతు తన వ్యవసాయ భూమిలో పశువులను మేపుతున్నారు. ఈ క్రమంలో పది అడుగుల పొడవైన భారీ కొండచిలువ ఓ ఎద్దు కాలును చుట్టేసింది. దీంతో పశువులు ఒక్కసారిగా పరుగుతీశాయి. గుర్తించిన రైతు కర్రతో కొట్టి దాన్ని హతమార్చాడు. ఇంత పెద్ద కొండచిలువను తామెప్పుడు చూడలేదని తండావాసులు అన్నారు.
ఇవీచూడండి: 'వైకాపా ప్రోద్భలంతోనే ఎస్సీలపై దాడులు'