ETV Bharat / state

119 కోసం...80 వేలు పోగొట్టుకున్నాడు - 80 thousand

ఆన్​లైన్ మోసాలపై అవగాహన లేక చాలామంది ఆ ఉచ్చులో చిక్కుకుంటున్నారు. ఎదుటివారి అవసరాన్ని సైబర్ నేరగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. 119 రూపాయలను తిరిగి పొందేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించిగా అతని బ్యాంక్​ అకౌంట్​లోని 80 వేల రూపాయలు ఖాళీ అయ్యాయి.

cyber crime
author img

By

Published : Oct 2, 2019, 4:30 PM IST

కృష్ణా జిల్లా కంకిపాడు మండలానికి చెందిన మస్తాన్​వలి అనే వ్యక్తి సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయాడు. బాధితుడు తన మొబైల్​లోని ఫోన్​పే యాప్ ద్వారా 119 రూపాయలు రీఛార్జ్ చేసుకున్నాడు. కానీ అది విఫలమవ్వటంతో.. ఎందుకు రీఛార్జ్ కాలేదు అనే విషయంపై ఆరా తీసేందుకు ప్రయత్నించాడు. దీనిలో భాగంగా గూగుల్​లో ఫోన్​పే కస్టమర్ కేర్ గురించి వెతగ్గా అతనికి ఓ ఫోన్ నెంబర్ లభించింది. దానికి ఫోన్ చేయగా ఓ వ్యక్తి మాట్లాడాడు. "లింకు పంపుతాను దానిపై క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది. దానిని నమోదు చేస్తే మీ ఖాతాలోకి తిరిగి నగదు జమ అవుతుంది" అని నమ్మబలికాడు. నిజమే అనుకున్న మస్తాన్​వలి అపరిచిత వ్యక్తి చెప్పినట్లుగానే చేశాడు. వెంటనే అతని బ్యాంక్​ ఖాతాలోని రూ.10 వేలు, ఇదే మొబైల్ నెంబరుతో అనుసంధానమైన అతని భార్య బ్యాంక్​ ఖాతా నుంచి మరో 70 వేల నగదు మాయమయ్యాయి. విషయాన్ని గ్రహించిన బాధితుడు స్థానిక పోలీసులను ఆశ్రయించాడు. వారు కేసు నమోదు చేసి విజయవాడ సైబర్ సెల్​కు బదిలీ చేశారు.

Intro:శ్రీకాకుళం జిల్లా పాలకొండ పాలకొండ మండలం లోని మట్టపల్లి గ్రామంలో సచివాలయాన్ని శాసనసభ్యురాలు విశ్వాస కళావతి బుధవారం ప్రారంభించారు మండలంలోని ఆదర్శ సచివాలయం గా అధికారులు ఇక్కడ భవనాన్ని తీర్చిదిద్దారు అంతకుముందు పాలకొండ నగర పంచాయతీ లోని ఇందిరా నగర్ కాలనీ లోని సచివాలయాన్ని శాసనసభ్యురాలు ప్రారంభించారు కార్యక్రమంలో వైకాపా రాష్ట్ర కార్యదర్శి పాలవలస విక్రాంత్ తో పాటు పలువురు నాయకులు అధికారులు పాల్గొన్నార

Body:palakonda

Conclusion:8008574300

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.