కట్టుకున్న వాడే కాలయముడిగా మారాడు. భార్యను కడతేర్చాలనుకున్న భర్త ఆమె నిద్రిస్తున్న సమయంలో కరెంట్ షాక్ పెట్టిన ఘటన కృష్ణాజిల్లా నందిగామ మండలం అంబారుపేట గ్రామంలో చోటు చేసుకుంది.
భార్య అరుణకు భర్త జానకిరామయ్య కడతేర్చాలనుకున్నాడు. నిద్రిస్తున్న సమయంలో ఈ దారుణానికి పాల్పడగా..ఆమె గట్టిగా కేకలు వేసింది. దీంతో చుట్టుపక్కల వారు వెంటనే రావడంతో అతను పరారయ్యాడు. స్థానికుల సహాయంతో బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. ఒక్కసారిగా ఆమెపై తన భర్త దారుణానికి ఒడిగట్టగా..ఊహించని ఈ సంఘటనకు భయభ్రాంతులకు లోనైంది. అనంతరం సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.