ETV Bharat / state

ఓ తండ్రి నిర్వాకం...అమ్మకానికి ఆడ'పసికందు'

నాన్న... ఈ పిలుపంటే ఓ బాధ్యత. అలాంటి పిలుపునకు మచ్చ తెచ్చాడు ఓ ప్రబుద్ధుడు. తనకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టారని ఓ అమ్మాయిని అమ్మకానికి పెట్టాడు. ఎనిమిది రోజుల పసికందును లక్షన్నర రూపాయలకు అమ్మేందుకు సిద్ధపడ్డాడు. విషయం తెలుసుకున్న అతని మామ ఎదురుతిరగడం వల్ల విషయం బయటకు వచ్చింది. కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిన్న అవుటపల్లిలో జరిగిన ఘటన వివరాలివీ...!

అమ్మకానికి ఆడపిల్ల
author img

By

Published : Oct 17, 2019, 8:11 PM IST

ఓ తండ్రి నిర్వాకం...అమ్మకానికి ఆడ'పసికందు'

కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిన్న అవుటపల్లిలోని పిన్నమనేని సిద్దార్థ ఆసుపత్రిలో దారుణం జరిగింది. అమ్మాయి పుట్టిందని 8 రోజుల పసికందును కన్న తండ్రే బేరానికి పెట్టాడు. నూజివీడు మండలం కొత్తూరు తండా సిద్దార్థనగర్​కు చెందిన రాజేష్​, రజిత నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. రజిత మొదటి కాన్పులో మగ బిడ్డ పుట్టాడు. మరోసారి గర్భం దాల్చిన ఆమె 8 రోజులు క్రితం రెండో కాన్పులో ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. ఇద్దరూ అమ్మాయిలే కావడం వల్ల రాజేష్​ ఓ బిడ్డను అమ్మేందుకు నిర్ణయించుకుని... ఒకటిన్నర లక్షలకు బేరం పెట్టాడు. అయితే ఇది గమనించిన రాజేశ్​ మామ అతనితో ఘర్షణ పడ్డాడు. మామ అల్లుళ్ల గొడవతో విషయం బయటకు వచ్చింది.

ఇదీ చూడండి:

చదివింది పదో తరగతే... అన్ని వ్యాధులకు చేస్తాడు వైద్యం...

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.