మత్తు తలకెక్కిన ఓ వ్యక్తి సొంత అన్న కుమార్తెను మూడో అంతస్తు నుంచి కింద పడేసిన దారుణ ఘటన విజయవాడ శివారులోని నున్న గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. వాంబే కాలనీలోని సీ2, 35వ బ్లాక్‌లో అపార్టుమెంట్లో కొండ్రాజు ఏసుబాబు, శ్రీదేవి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. ఏసుబాబు తన సోదరుడైన కృష్ణతో కలిసి టైల్స్ పనులు చేస్తుంటాడు. కృష్ణకు వివాహమైంది. మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోకపోవటంతో భార్య అతన్ని విడిచి పుట్టింటికి వెళ్లిపోయింది. కృష్ణ తన అన్న ఇంటి వద్దే ఎక్కువగా ఉంటున్నాడు. ఆదివారం మధ్యాహ్నం మద్యం తాగిన కృష్ణ.. అన్నఇంటికి వచ్చాడు. శ్రీదేవి అతనికి భోజనం పెట్టింది. తింటూనే ఇల్లంతా చెల్లాచెదురుగా అన్నం పడేయటంతో ఎందుకిలా చేస్తున్నావంటూ ఆమె ప్రశ్నించింది. కృష్ణ దుర్భాషలాడటం ప్రారంభించాడు. ఏసుబాబు జోక్యం చేసుకోవటంతో గొడవ ప్రారంభమైంది. ఇది శ్రుతి మించటంతో మద్యం మత్తులో ఉన్న కృష్ణ కోపంతో ఊగిపోతూ.. అక్కడే ఉన్న ఏసుబాబు పెద్ద కుమార్తె జానకి(6)ని జుట్టుపట్టుకుని పైకి లేపి మూడో అంతస్తు నుంచి కింద పడేశాడు. చిన్నారికి తల వెనుక భాగంలో బలమైన గాయమై ముక్కు, చెవులు, నోటి నుంచి రక్తం రావటంతో జీజీహెచ్‌కు తరలించారు. కోపోద్రిక్తులైన స్థానికులు కృష్ణకు దేహశుద్ధి చేశారు. శ్రీదేవి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితున్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ నెల23న బాలిక పుట్టినరోజును ఘనంగా చేయాలనుకుంటే ఇలా జరిగిందంటూ శ్రీదేవి కన్నీరుమున్నీరుగా విలపిస్తుండటం పలువురిని కంటతడి పెట్టించింది.
మూడో అంతస్తు నుంచి చిన్నారిని తోసేసిన బాబాయి - వాంబేకాలనీ న్యూస్
ఆరేళ్ల పాపపై సొంత బాబాయి యుముడిలా ప్రవర్తించాడు. అతని అన్నపై కోపాన్ని అభంశుభం తెలియని చిన్నారిపై చూపాడు. దయాదాక్షిణ్యాలు మరచి మూడో అంతస్తు నుంచి పాపను పడేశాడు.
మత్తు తలకెక్కిన ఓ వ్యక్తి సొంత అన్న కుమార్తెను మూడో అంతస్తు నుంచి కింద పడేసిన దారుణ ఘటన విజయవాడ శివారులోని నున్న గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. వాంబే కాలనీలోని సీ2, 35వ బ్లాక్‌లో అపార్టుమెంట్లో కొండ్రాజు ఏసుబాబు, శ్రీదేవి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. ఏసుబాబు తన సోదరుడైన కృష్ణతో కలిసి టైల్స్ పనులు చేస్తుంటాడు. కృష్ణకు వివాహమైంది. మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోకపోవటంతో భార్య అతన్ని విడిచి పుట్టింటికి వెళ్లిపోయింది. కృష్ణ తన అన్న ఇంటి వద్దే ఎక్కువగా ఉంటున్నాడు. ఆదివారం మధ్యాహ్నం మద్యం తాగిన కృష్ణ.. అన్నఇంటికి వచ్చాడు. శ్రీదేవి అతనికి భోజనం పెట్టింది. తింటూనే ఇల్లంతా చెల్లాచెదురుగా అన్నం పడేయటంతో ఎందుకిలా చేస్తున్నావంటూ ఆమె ప్రశ్నించింది. కృష్ణ దుర్భాషలాడటం ప్రారంభించాడు. ఏసుబాబు జోక్యం చేసుకోవటంతో గొడవ ప్రారంభమైంది. ఇది శ్రుతి మించటంతో మద్యం మత్తులో ఉన్న కృష్ణ కోపంతో ఊగిపోతూ.. అక్కడే ఉన్న ఏసుబాబు పెద్ద కుమార్తె జానకి(6)ని జుట్టుపట్టుకుని పైకి లేపి మూడో అంతస్తు నుంచి కింద పడేశాడు. చిన్నారికి తల వెనుక భాగంలో బలమైన గాయమై ముక్కు, చెవులు, నోటి నుంచి రక్తం రావటంతో జీజీహెచ్‌కు తరలించారు. కోపోద్రిక్తులైన స్థానికులు కృష్ణకు దేహశుద్ధి చేశారు. శ్రీదేవి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితున్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ నెల23న బాలిక పుట్టినరోజును ఘనంగా చేయాలనుకుంటే ఇలా జరిగిందంటూ శ్రీదేవి కన్నీరుమున్నీరుగా విలపిస్తుండటం పలువురిని కంటతడి పెట్టించింది.
eenadu
Conclusion: