కృష్ణా జిల్లాలో 3,01,718 ఓట్లకు గానూ.. 2,53,792 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో పురుషులు 1,26,098 మంది ఓటు హక్కు వినియోగించుకోగా 1,27,692 మంది మహిళలు ఓటింగ్లో పాల్గొన్నారు. మొత్తం 175 గ్రామ పంచాయతీలకు సంబంధించి 1725 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరిగింది. మండలాల వారీగా పరిశీలిస్తే గుడివాడలో 84.46 శాతం, గుడ్లవల్లేరు 86 శాతం, కైకలూరు 82.11 శాతం, కలిదిండి 85.40 శాతం, మండవల్లి మండలంలో అత్యధికంగా 88.37 శాతం నమోదు అవ్వగా పామర్రు లో అత్యల్పంగా 78 .01 శాతం,ముదినేపల్లి 85 .49 శాతం,నందివాడ 84 .16 శాతం,పెదపాడుపూడి 86 .45 శాతం నమోదు అయింది.
ఇదీ చదవండి: లోకల్ రిజల్ట్: వెలువడుతున్న రెండవ దశ పంచాయతీ ఎన్నికల ఫలితాలు