ETV Bharat / state

MOUNTAIN CLIMBING: ఎనిమిదేళ్ల వయసులోనే ఎల్బ్రస్ శిఖరాన్ని అధిరోహించిన బుడతడు - ఏపీ లేటెస్ట్ న్యూస్

ఐదేళ్ల బాలిక చేసిన ధైర్యాన్ని టీవీలో చూసి ఆశ్చర్యపోయాడు. అరే కిలిమంజారో పర్వతాన్ని భలేగా ఎక్కేసిందే.. నేనూ అలాగే ఎక్కేయాలనుకున్నాడు. ఇంకేముంది తల్లిదండ్రులకు చెప్పి ఒప్పించాడు. ఎనిమిదేళ్ల వయసులోనే ఐదు నెలల పాటు కఠోర సాధన చేశాడు. యూరప్ ఖండంలోనే అత్యంత ఎత్తైన ఎల్బ్రస్ శిఖరాన్ని అధిరోహించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. ఆ చిన్నారే... ప్రస్తుత మైనార్టీ, సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్న గంధం చంద్రుడు కుమారుడు భువన్ జై.

8-years-old-gandham-bhuvan-climb-the-mount-elbrus
ఎనిమిదేళ్ల వయసులోనే ఎల్బ్రస్ శిఖరాన్ని అధిరోహించిన బుడతడు
author img

By

Published : Oct 3, 2021, 10:25 AM IST

ఐదేళ్ల బాలిక.... కిలిమంజారో పర్వతాన్ని ఎక్కిన వార్తను టీవీలో చూశాడు భువన్. ఆ క్షణమే తానూ అత్యంత ఎత్తైన పర్వతాలను అధిరోహించాలని నిర్ణయించున్నాడు. ఇదే విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. చిన్నారిలోని ఆసక్తిని, ధైర్యాన్ని గుర్తించి శిక్షణ ఇప్పించేందుకు వారూ ఒప్పుకున్నారు. మంచులో ఎత్తైన పర్వతాలను అధిరోహించటం అత్యంత తేలికైన విషయం కాదు. ఎంతో కఠోర శిక్షణ, ఆరోగ్యంగా ఉంటే తప్ప వాటిని ఎక్కలేరు. అలాంటి ఈ చిన్నారి క్లిష్ట వాతావరణాన్ని ఎదుర్కొనేలా సంసిద్ధుడై... పర్వతారోహణ చేసి మెరుగైన ప్రతిభను కనబరిచాడు.

ఎనిమిదేళ్ల వయసులోనే ఎల్బ్రస్ శిఖరాన్ని అధిరోహించిన బుడతడు

ప్రస్తుతం మూడో తరగతి చదువుతున్న భువన్.... పర్వతాన్ని అధిరోహించేందుకు అనేక ప్రాంతాల్లో శిక్షణ తీసుకున్నాడు. భయపడకుండా ఎత్తైన కొండలు ఎక్కడంపై అనంతపురం, గండికోట, తెలంగాణ భువనగిరిలో తర్ఫీదు పొందాడు. మంచును తట్టుకునేలా లద్దాఖ్‌లో శిక్షణ తీసుకున్నాడు. 5నెలల కఠోర సాధన అనంతరం.... సెప్టెంబర్ 11న... తన బృందంతో కలిసి రష్యాకు వెళ్లాడు. 12న టెర్స్ కోల్‌లోని మౌంట్ ఎల్బ్రస్ బేస్‌కు వెళ్లిన ఆ బృందం...... 13 వ తేదీన 3 వేల 500 మీటర్లు అధిరోహించి తిరిగి బేస్ క్యాంప్‌కు చేరుకుంది. అక్కడ కొంత శిక్షణ అనంతరం 18న... 5 వేల 642 మీటర్ల ఎత్తైన ఎల్బ్రస్ పర్వత శిఖరానికి చేరుకొని రికార్డు నెలకొల్పాడు.

భువన్‌ ప్రతిభ పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారిలోని ఆసక్తిని గమనించి శిక్షణ ఇప్పించినట్లు చెబుతున్నారు. భవిష్యత్తులోనూ భువన్‌ మరిన్ని పర్వతాలు అధిరోహించేందుకు తోడ్పాటు అందిస్తామంటున్నారు ఐఏఎస్‌ అధికారి గంధం చంద్రుడు.

క్లిష్టమైన వాతావరణాన్ని ఎదుర్కొని... పర్వతాన్ని అధిరోహించి రికార్డు నెలకొల్పిన భువన్‌ ధైర్య, సాహసాలపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి జగన్‌ కూడా భునన్‌ ఘనతను మెచ్చుకున్నారు.

ఇదీ చూడండి: దివ్యాంగుల సాహసం.. పర్వతారోహణలో ప్రపంచ రికార్డు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.