ETV Bharat / state

మండలిలో మారిన పార్టీల సంఖ్యాబలం.. ఎవరికి ఎన్నెన్ని సీట్లంటే..! - ఏపీ శాసన మండలి వార్తలు

శాసన మండలి నుంచి 8 మంది ఎమ్మెల్సీలు పదవి విరమణ చేయనున్నారు. తెలుగుదేశం నుంచి రెడ్డి సుబ్రమణ్యం, వైవీబీ రాజేంద్రప్రసాద్, బుద్దా వెంకన్న, పప్పల చలపతి రావు, గాలి సరస్వతి, ద్వారపురెడ్డి జగదీశ్వరరావు, బుద్దా నాగ జగదీశ్వరరావు పదవీ విరమణ చేయనున్నారు. వైకాపా నుంచి మండలిలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పదవీ విరమణ చేయనున్నారు.

శాసన మండలి నుంచి నేడు 8 మంది ఎమ్మెల్సీల పదవీ విరమణ

author img

By

Published : Jun 18, 2021, 6:35 AM IST

Updated : Jun 18, 2021, 12:35 PM IST

శాసన మండలి నుంచి నేడు 8 మంది ఎమ్మెల్సీలు పదవీ విరమణ చేయనున్నారు. తెలుగుదేశం నుంచి ఏడుగురు, అధికార వైకాపా నుంచి ఒకరి పదవీ కాలం ముగిసింది. తెలుగుదేశం నుంచి రెడ్డి సుబ్రమణ్యం, వైవీబీ రాజేంద్రప్రసాద్, బుద్దా వెంకన్న, పప్పల చలపతి రావు, గాలి సరస్వతి, ద్వారపురెడ్డి జగదీశ్వరరావు, బుద్దా నాగ జగదీశ్వరరావు పదవీ విరమణ చేయనున్నారు. వైకాపా నుంచి మండలిలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పదవీ విరమణ చేయనున్నారు.

పార్టీల బలబలాలు ఎంతంటే..

ఎక్కువ మంది తెదేపా సభ్యుల పదవీ కాలం ముగియడంతో మండలిలో వైకాపా సంఖ్యాబలం 21కి పెరగనుంది. తెదేపా సభ్యుల సంఖ్య 15కి తగ్గనుంది. కౌన్సిల్​లో స్థానిక సంస్థల కోటా కింద ఖాళీలు 11కు పెరగనున్నాయి. స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీ ఎన్నికలు ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. కరోనా దృష్ట్యా ఈసీ ఎన్నికలపై నిషేధం విధించటంతో ఎన్నికలు ఆలస్యం కానున్నాయి. మరోవైపు పరిషత్ ఎన్నికలను హైకోర్టు రద్దు చేయడంతో స్థానిక సంస్ధల కోటా ఎమ్మెల్సీల ఎన్నికల ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది.

ఇవీ చదవండి

నేడు జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్న సీఎం జగన్

Last Updated : Jun 18, 2021, 12:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.