ETV Bharat / state

LORRIES STRANDED IN FLOOD: ఇసుక కోసం వెళ్లి కృష్ణా నదిలో చిక్కుకున్న 132 లారీలు - కృష్ణాజిల్లా వార్తలు

lorries stranded in the flood
lorries stranded in the flood
author img

By

Published : Aug 14, 2021, 8:33 AM IST

Updated : Aug 14, 2021, 12:04 PM IST

08:31 August 14

వరదలో చిక్కిన 132 లారీలు

ఇసుక కోసం వెళ్లి కృష్ణా నదిలో చిక్కుకున్న 132 లారీలు

కృష్ణా జిల్లా నందిగామలో ఒక్కసారిగా పెరిగిన వరద కారణంగా.. నీటిలో 132 ఇసుక లారీలు చిక్కుకున్నాయి. కంచికచర్ల మండలం చెవిటికల్లు ఇసుక ర్యాంపులోకి ఇసుక రవాణా కోసం వందకు పైగా లారీలు వెళ్లాయి. ఉన్నట్లుండి ఒక్కసారిగా వరద రావడంతో లారీలన్నీ ర్యాంపులోనే నిలిచిపోయాయి. ఇసుక ర్యాంపులోకి వెళ్లే రహదారి వరదనీటికి కొట్టుకుపోవడంతో వెనక్కి తిరిగి రాలేని పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు, రెవెన్యూ, అగ్నిమాపక అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. పడవల ద్వారా డ్రైవర్లు, క్లీనర్లు, కూలీలను పోలీసులు ఒడ్డుకు చేర్చారు.

వరద తగ్గితే తప్ప ఈ లారీలను బయటకు తీసుకురాలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం కృష్ణానదికి పులిచింతల డ్యామ్‌ నుండి 75 వేల క్యూసెక్కులు, మున్నేరు, కట్టలేరు, వైరాల నుంచి మరో 5వేల క్యూసెక్కులు కలిసి 80 వేల క్యూసెక్కుల నీరు కృష్ణానదికి వచ్చి చేరుతుంది. పులిచింతల డ్యామ్‌ నుంచి నీటిని పూర్తిగా నిలిపివేసి ప్రకాశం బ్యారేజి గేట్లు తెరిస్తే మినహా.. ఈ లారీలు బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికే ఇసుకకోసం ఈ లారీలు వెళ్లి సుమారు 20 గంటల సమయం దాటుతోంది. 

ఈరోజు తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో మున్నేరుకు ఒక్కసారిగా వరద రావడం, లారీలు వెనక్కి తిరిగి వచ్చే రోడ్డు మార్గం లేకపోవడంతో లారీలు అన్నీ వరద నీటిలో చిక్కుకున్నాయి. రెవెన్యూ, పోలీస్‌, అగ్నిమాపక అధికారులు పడవల ద్వారా లారీ డ్రైవర్లు, క్లీనర్లను ఒడ్డుకు చేర్చగలిగారు. ఇసుక కాంట్రాక్ట్‌ సంస్థ జె.పి.పవర్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ కంపెనీ ప్రతిరోజూ వందలాది లారీలతో ఇసుక రవాణా చేస్తున్నప్పటికీ.. కనీసం సరైన రోడ్డుమార్గం ఏర్పాటు చేయకపోవడం వల్ల అటు లారీ డ్రైవర్లు, ఇటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి నుంచి చెవిటికల్లు మీదుగా కృష్ణానది క్వారీకి వచ్చే రోడ్డు అధ్వానంగా తయారైంది. కనీసం నడిచేందుకు సరైన రోడ్డుమార్గం లేదు. అర్థరాత్రి నుంచి వరద నీటిలో చిక్కుకున్న లారీ డ్రైవర్లు, క్లీనర్లు, కూలీలు అనేక అవస్థలు పడుతున్నప్పటికీ జె.పి.వపర్‌ వెంచర్స్‌ కంపెనీ.. వారి బాగోగుల గురించి పట్టించుకోలేదు. వరదలో చిక్కుకున్న లారీలు వరదకు దెబ్బతింటున్నాయని లారీ యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు.

కన్నెత్తి చూడని ఉన్నతాధికారులు..

వరదలో లారీలు చిక్కుకున్న ఈ పరిస్థితి పై జిల్లా ఉన్నతాధికారులెవ్వరూ ఇటువైపు కన్నెత్తి చూడలేదు. కేవలం మండల స్థాయి అధికారులే పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈ పరిస్థితిలో లారీలు రేపటికి కానీ  బయటకు వచ్చే మార్గం కనిపించడంలేదు.

ఇదీ చదవండి:

FISHERMEN MISSING: శ్రీకాకుళం సముద్ర తీరంలో ముగ్గురు జాలర్లు గల్లంతు

Last Updated : Aug 14, 2021, 12:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.