Suicide Case: కోనసీమ జిల్లాలో చల్లపల్లి పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య ఘటనలో పోలీసులు ముగ్గురు వైకాపా నాయకులపై కేసు నమోదు చేశారు. ఆమెను వేధింపులకు గురిచేసి ఆత్మహత్యకు పాల్పడే విధంగా ప్రేరేపించినందుకు.. చల్లపల్లి గ్రామానికి చెందిన వైకాపా నాయకులు వరసాల సత్యనారాయణ, చీకరమల్లి సత్యనారాయణ, దంగేటి రాంబాబులపై ఐపీసీ సెక్షన్ 306, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. ఘటనపై భవాని బంధువులు ప్రజా సంఘ నాయకులు.. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సైతం ఫిర్యాదు చేశారు.
నిన్న ఆత్మహత్య చేసుకున్న భవాని మృతదేహానికి అమలాపురం ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని.. అలాగే నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రి వద్ద ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు, దళిత సంఘం నాయకులు నిరసన వ్యక్తం చేశారు
ఇదీ జరిగింది: కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి పంచాయతీ కార్యదర్శి, ఎస్టీ మహిళ అయిన రొడ్డా భవాని(32) గురువారం అమలాపురం మండలం కామనగరువులోని తన సొంతింట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈమెకు భర్త వెంకటేశ్వరరావు, కుమార్తె, కుమారుడు ఉన్నారు. రాజమహేంద్రవరానికి చెందిన భవాని పదేళ్ల క్రితం వెంకటేశ్వరరావును పెళ్లి చేసుకున్నారు. ఈమె 2019లో చల్లపల్లి పంచాయతీ కార్యదర్శిగా వచ్చారు. మూడు నెలల క్రితం పంచాయతీ పాలకవర్గ సమావేశం నిర్వహించాల్సి ఉండగా.. 90 రోజుల గడువు దాటిన మూడు రోజులకు సమావేశం నిర్వహించారు. అప్పట్నుంచి కొందరు ఆమెను వేధిస్తుండడంతో తాళలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు.
ఇదీ చదవండి: