KONASEEMA: కోనసీమ జిల్లా పేరు మార్పుపై ఉత్కంఠ వీడలేదు. జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించి.. ప్రజాభిప్రాయ సేకరణకు ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మే 18 నుంచి జూన్ 18 లోపు అభ్యంతరాలు, అభీష్టాలు, సూచనలు తెలియజేయాలంది. ఈ గడువు శనివారంతో ముగిసింది. అనంతర పరిణామాలతో జిల్లా కేంద్రం అమలాపురం అట్టుడికింది. విధ్వంసకాండ తర్వాత ఆచితూచి అడుగులు వేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో భవిష్యత్తులో ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం ఎలా ఉంటుందోనన్న చర్చ జోరుగా నడుస్తోంది.
కోనసీమ జిల్లాలోని 22 మండలాల ప్రజల నుంచి విజ్ఞాపనలు స్వీకరించారు. అన్నింటినీ క్రోడీకరించి.. ప్రజాభిప్రాయం ఎలా ఉందో స్పష్టతకు రానున్నారు. క్రోడీకరణ ప్రక్రియను వారం రోజుల్లో పూర్తిచేసి.. నివేదికను ప్రభుత్వానికి పంపనున్నట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు.
ఇవీ చదవండి: