Nagamalli Flowers: కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం రామేశ్వరంలోని శ్రీ కృతకృత్య రామలింగేశ్వరస్వామి వారి ఆలయంలో అరుదైన నాగమల్లి పుష్పాలు కనువిందు చేస్తున్నాయి. ఏడాదికోసారి మాత్రమే పూసే ఈ పూల మధ్యభాగంలో పడగ విప్పిన సర్పం వలే మధ్యలో శివలింగాకారం ఉంటుంది. ఇవి కొమ్మలకు పూయకుండా.. ఊడల్లాంటి కాండాలకు పూస్తూ సువాసనను వెదజల్లుతాయి. మహా శివుడికి ఏంతో ప్రీతికరమైన ఈ పూలను దర్శించడం పుణ్యమని భక్తులు విశ్వసిస్తున్నారు.
ఆలయ ఆవరణలో పూర్వం నుంచి నాగలింగ వృక్షం ఉండేదని.. తుపానుల వల్ల చెట్టు కూలిపోగా దాని వేర్లతో ఈ చెట్టు వచ్చిందని అర్చకులు చెబుతున్నారు. ఈ వృక్షానికి పదేళ్లు వచ్చేవరకు ఎలాంటి పూలు పూయవని.. ఆ తర్వాత ఏడాదికోసారి పూలు పూస్తాయని చెబుతున్నారు. ఈ పూలు, అరుదుగా కాసే కాయలు కూడా ఆయుర్వేద మందుల తయారీలో వాడాతారన్నారు. శివలింగ వృక్షం శాస్త్రీయ నామం కౌరాపిట గియానెన్సిస్. ఇవి కేవలం ప్రపంచంలోని దక్షిణ అమెరికా, దక్షిణ భారతదేశంలో మాత్రమే కనిపిస్తాయని వృక్షశాస్త్ర నిపుణులు చెపుతున్నారు.
ఇవీ చదవండి:Nara Lokesh : సీఎం జగన్కు.. నారా లోకేశ్ 17 ప్రశ్నలు.. ఏంటంటే..!