ETV Bharat / state

అమలాపురం నుంచి నేనే పోటీ చేస్తా: మంత్రి పినిపే విశ్వరూప్​ - మంత్రి పినిపే విశ్వరూప్ వార్తలు

Pinipe Viswarup : అమలాపురం నియోజకవర్గంలో 2024 అసెంబ్లీ ఎన్నికలలో ఎవరు పోటీ చేస్తారనే ఆంశంలో మంత్రి పినిపే విశ్వరూప్​ స్పందించారు. రాబోయే ఎన్నికలో తానే ఎన్నికల బరిలో ఉండనున్నట్లు స్పష్టం చేశారు. తన కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయారని.. తానే పోటీ చేస్తానని తెలిపారు.

Minister Pinipe Viswarup
మంత్రి పినిపే విశ్వరూప్​
author img

By

Published : Dec 19, 2022, 7:04 PM IST

Updated : Dec 19, 2022, 7:25 PM IST

Minister Pinipe Viswarup: రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో అమలాపురం నియోజకవర్గం నుంచి తానే పోటీ చేస్తానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ స్పష్టం చేశారు. డాక్టర్​ బీఆర్​ అంబేడ్కర్​ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలంలో నిర్వహించిన గడప గడపకు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆయనతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కుమారుడు శ్రీకాంత్​.. వానపల్లి పాలెం గ్రామంలో ప్రజల సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.

అమలాపురం నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తారనే సందిగ్ధత ఉండేదని.. రాబోయే 2024 అసెంబ్లీ ఎన్నికలలో తానే పోటి చేస్తానని మంత్రి పినిపే విశ్వరూప్ తెలిపారు. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని అన్నారు. తాను పోటీ చేస్తే.. తన కుమారులు తనతో కలిసి పని చేస్తారని స్పష్టం చేశారు. రాజకీయంగా తన కుమారులకు పోటీ చేసే అర్హత ఉందని.. రాబోయే రోజుల్లో మంచి అవకాశం వస్తుందని భావిస్తున్నానని అభిప్రాయం వ్యక్తం చేశారు.

పినిపే విశ్వరూప్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి

"వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అమలాపురం నియోజక వర్గం నుంచి నేనే పోటీ చేస్తాను. ఏ విధమైన కుటుంబ కలహాలు లేవు. రాజకీయంగా నా కుమారులు అర్హులే.. రాబోయే రోజుల్లో జగన్​ మోహన్​ రెడ్డి ఆశీస్సులు ఉంటే మంచి అవకాశం వస్తుందని భావిస్తున్నాను." - పినిపే విశ్వరూప్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి

ఇవీ చదవండి:

Last Updated : Dec 19, 2022, 7:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.