ETV Bharat / state

Kodikatti Case Accused Family Tried to Met CM Jagan: సీఎం జగన్​ను కలిసేందుకు శ్రీనివాసరావు తల్లిదండ్రుల ప్రయత్నం.. నిర్బంధించిన పోలీసులు

author img

By

Published : Aug 12, 2023, 11:38 AM IST

Kodikatti Case Accused Family Tried to Met CM Jagan: అమలాపురంలో సీఎం జగన్‌ను కలిసేందుకు ప్రయత్నించిన కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాసరావు తల్లిదండ్రులు సావిత్రి, తాతారావు, సోదరుడు సుబ్బరాజులకు నిరాశే మిగిలింది. తమ కుమారుడికి బెయిల్‌ ఇప్పించాలని విన్నవించేందుకు వారు సీఎంను కలిసేందుకు ప్రయత్నించారు.

Kodikatti_Case_Accused_Family
Kodikatti_Case_Accused_Family

Kodikatti Case Accused Family Tried to Met CM Jagan: సొంత బాబాయ్ హత్య కేసులో నిందితుడుగా ఉన్న వారు యథేచ్ఛగా బయట తిరుగుతున్నారని.. డ్రైవర్​ను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ కూడా బయటే తిరుగుతున్నాడని.. పలుకుబడి ఉన్ప రాజకీయ నాయకులకు ఒక న్యాయం.. నిరుపేదలకు ఒక న్యాయమా అని కోడికత్తి కేసు నిందితుడి బంధువులు ప్రశ్నిస్తున్నారు. కేసును తొందరగా విచారించి తమ కుటుంబానికి ఆసరాగా నిలిచే శ్రీనివాసరావును విడుదల చేయాలని కోరారు.

Kodikatti Case Accused Family Avedana: బీఆర్​ అంబేడ్కర్​ కోనసీమ జిల్లా అమలాపురంలో ముఖ్యమంత్రి జగన్​ పర్యటించిన సంగతి తెలిసిందే. అయితే సీఎం జగన్‌ను కలిసేందుకు ప్రయత్నించిన కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాసరావు తల్లిదండ్రులు సావిత్రి, తాతారావు, సోదరుడు సుబ్బరాజులకు నిరాశే మిగిలింది. తమ కుమారుడికి బెయిల్‌ ఇప్పించాలని విన్నవించేందుకు వారు సీఎంను కలిసేందుకు ప్రయత్నించారు. బయటకు వెళ్లేందుకు వీళ్లేదని పోలీసులు హుకుం జారీ చేయడంతో చేసేదిలేక వారు శుక్రవారం ముమ్మిడివరం స్టేషన్‌కు వచ్చి ఎస్సై సురేష్‌బాబును కలిశారు. వారిని ఆయన పోలీసుస్టేషన్‌లోనే కూర్చోబెట్టారు. సీఎం వెళ్లిన తర్వాత వారిని ఇంటికి పంపారు.

Kodikatti Case Updates: ఇటీవల లంక గ్రామాల పర్యటన సందర్భంగా సీఎంను కలిసేందుకు ప్రయత్నించామని.. పోలీసులు అమలాపురం వచ్చినపుడు అవకాశమిస్తామని చెప్పి ఇప్పుడూ నిర్బంధించడం దారుణమని కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాసరావు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో సీఎం జగన్​ కలిసేందుకు తాడేపల్లి వెళ్లినా అవకాశం ఇవ్వలేదని వారు వాపోయారు. ముఖ్యమంత్రి న్యాయం చేస్తారనే ఆశతో ఉన్నామని విలపించారు.

Kodikatti Case New Updates: 2018వ సంవత్సరం విశాఖ విమానాశ్రయంలో అప్పటి ప్రతిపక్షనేత, ప్రస్తుత సీఎం జగన్​ మోహన్​ రెడ్డిపై కోడికత్తితో దాడి జరిగింది. ఆ కేసులో శ్రీనివాసరావును నిందితుడిగా అదుపులోకి తీసుకున్నారు. గత నాలుగున్నర నుంచి శ్రీనివాసరావు రాజమహేంద్రవరం జైలులో మగ్గుతున్నాడు. తనను విడుదల చేసి.. జైలు నుంచి విముక్తి కలిగించాలని పలుమార్లు శ్రీనివాసరావు వేడుకున్నాడు. అలాగే అతని తల్లి కూడా పలుమార్లు తన కొడుకును విడుదల చేయాలని పలువురికి లేఖలు కూడా రాశారు. సీఎం జగన్​ కలిసేందుకు తాడేపల్లి వచ్చినా లాభం లేకపోయింది. కాగా ఆగస్టు 11న సీఎం జగన్​ అమలాపురం పర్యటనకు వచ్చినా కూడా ఆయనను కలవడానికి అనుమతి లభించలేదు. అయితే ఈ కేసులో ఎటువంటి కుట్రకోణం లేదని, నిందితుడు టీడీపీ సానుభూతిపరుడు కాదని ఎన్​ఐఏ స్పష్టం చేసిన.. వైసీపీ సర్కార్​ ఇంకా దర్యాప్తు కావాలని పట్టుబడుతోంది. ఇప్పటికైనా తమ కొడుకుకు జైలు నుంచి విముక్తి కలిగించాలని శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.