HIGH COURT STAY ON CASE FILE ON AMARAVATI FARMERS: అమరావతి రైతుల మహాపాదయాత్ర సందర్భంగా.. పరిరక్షణ సమితి నేతలపై కోనసీమ జిల్లాలోని రాయవరం పోలీస్‌స్టేషన్‌లో నమోదు చేసిన కేసుపై.. హైకోర్టు స్టే విధించింది. అమరావతి పరిరక్షణ సమితి నేతలు శివారెడ్డి, గద్దె తిరుపతిరావు, పువ్వాడ సుధాకర్‌పై రాయవరం ఎస్సై ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. పోలీసులు కేసు నమోదు చేశారు. తమపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ.. శివారెడ్డి, గద్దె తిరుపతి రావు, పువ్వాడ సుధాకర్.. హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
పాదయాత్రలో పాల్గొన్న పరిరక్షణ నేతలను వేధించేందుకే కేసు పెట్టారని.. పిటిషనర్ తరఫు న్యాయవాది లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ఈ కేసులో తదుపరి చర్యలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే కేసులో ఉన్న అన్నపూర్ణమ్మకు 41-A నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది.
ఇవీ చదవండి: