ETV Bharat / state

మత బోధకుడి ముసుగులో దళిత బాలికపై లైంగిక దాడి.. పుట్టిన శిశువునూ అమ్మకం! - girl pregnant

church pastor made a Dalit girl pregnant : పాస్టర్ వృత్తికి కళంకం తెచ్చాడో వ్యక్తి. మత బోధకుడిగా భక్తులకు మంచి, చెడు గురించి చెప్పాల్సిందిపోయి విచక్షణ కోల్పోయాడు. పేదరికం, అమాయకత్వం అలుసుగా తీసుకుని.. డబ్బు ఎర జూపి గ్రామానికి చెందిన బాలికను ఇంట్లో పని మనిషిగా తీసుకువెళ్లాడు. తరచూ కామవాంఛ తీర్చుకుంటూ.. పుట్టిన శిశువును కూడా లక్షల రూపాయలకు అమ్మేశాడు. విషయం బయట పడకుండా.. అందులో కొంత వాటాలు పంచాడు. చివరికి బాలిక తరఫు బంధువులు, గ్రామ యువత ఫిర్యాదుతో జరిగిన ఘోరం వెలుగుచూసింది.

దళిత బాలికపై లైంగిక దాడి
దళిత బాలికపై లైంగిక దాడి
author img

By

Published : Apr 11, 2023, 6:26 PM IST

దళిత బాలికపై లైంగిక దాడి

church pastor made a Dalit girl pregnant : మత బోధనల పేరిట ఓ గ్రామానికి చేరుకున్న పాస్టర్.. ఊరి చివర ఒంటరిగా ఉంటున్న దళిత బాలికపై కన్నేశాడు. బాలిక తల్లి లేకపోవడం, తండ్రి గుడ్డివాడు కావడం, పేదరికాన్ని అలుసుగా తీసుకుని ఆ అమాయకురానిని లొంగదీసుకున్నాడు. తాను ఎక్కడకు వెళ్లినా, ఎంత దూరమైనా వెంట తీసుకెళ్లేవాడు. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చగా.. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఎవరైనా ప్రశ్నిస్తే.. కడుపులో కణితి పెరుగుతోందంటూ నమ్మించాడు. పైగా, చికిత్స చేయిస్తున్నానంటూ ఆస్పత్రులకు తిప్పేవాడు.

తగ్గిపోయేందుకు మందులు వాడుతున్నామంటూ మాయమాటలు చెప్పాడు. చివరికి ప్రసవం చేయించి పసికందును కూడా లక్షల రూపాయలకు విక్రయించినట్లు బాలిక బంధువులు వాపోయారు. ఈ నేపథ్యాన ఇప్పటికే ఫిర్యాదు అందుకున్న ఐసీడీఎస్ అధికారులు.. విచారణ ప్రారంభించగా, మరో వైపు పోలీసులు కూడా దర్యాప్తు చేపట్టారు. బాలిక బంధువుతో పాటు గ్రామానికి చెందిన పలువురు యువకులు కలెక్టర్​కు ఫిర్యాదు చేయడంతో పాస్టర్ దారుణం వెలుగులోకి వచ్చింది.

ప్రైవేటు ఆస్పత్రిలో సిజేరియన్.. బాలిక గర్భం దాల్చేందుకు కారణమైన పాస్టర్.. పుట్టిన శిశువును కూడా అమ్ముకున్నట్లు తెలుస్తోంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం పుల్లేటి కుర్రు గ్రామానికి చెందిన ఓ మత బోధకుడు.. దళిత బాలికను చేరదీశాడు. పేద కుటుంబం కావడంతో డబ్బులు ఆశ చూపి తన వెంట తిప్పుకున్నాడు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో.. తాను వెళ్లిన ప్రాంతాలకు తీసుకువెళ్లాడు. ఇంట్లో పనులు చేయించుకుంటూ మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక కుటుంబ సభ్యులకు అనుమానం రావడంతో... కడుపులో కణితి పెరుగుతోందని చెప్పి మందులు వాడించాడు. మార్చి 5న అమలాపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి సిజేరియన్ చేయించగా.. పుట్టన మగబిడ్డను మాయం చేశాడు.

అధికారులకు ఫిర్యాదుతో వెలుగులోకి.. పసిగుడ్డును లక్షల రూపాయలకు విక్రయించి కొంత మొత్తాన్ని బాలిక కుటుంబ సభ్యులకు, మరికొంత మొత్తాన్ని సహకరించిన వ్యక్తులకు ఇచ్చి వ్యవహారం బయటపడకుండా గోప్యంగా ఉంచాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అమలాపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆ బాలికను చేర్పించిన విషయాన్ని కూడా అతను బయటికి రానివ్వకుండా చేశాడని తెలిపారు. నిరు పేద కుటుంబానికి చెందిన దళిత బాలికకు గర్భం చేసి బిడ్డను మాయం చేసిన ఆ మత బోధకుడి పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం చేయాలని బంధువులు, గ్రామ యువత అధికారులకు విన్నవించారు. అధికారులు స్పందించి పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని కోరుతూ.. కలెక్టర్ ఇమామ్స్ శుక్లాకు స్పందనలో ఫిర్యాదు చేశారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.