ETV Bharat / state

Chandrababu Criticized YCP Government: వైసీపీ ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారింది: చంద్రబాబు - Racchabanda program

Chandrababu Criticized YCP Government: కోనసీమ జిల్లా మండపేట మండలం ఏడిదలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు పర్యటించారు. రచ్చబండలోని రైతు సదస్సులో పాల్గొని.. అన్నదాతల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం.. రైతుల పాలిట శాపంగా మారిందని.... చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసమర్థ నిర్ణయాలతో... వ్యవసాయ రంగాన్ని కుదేలు చేశారని మండిపడ్డారు. ప్రాజెక్టులను అటకెక్కించి... చుక్క నీరు లేకుండా చేశారన్నారు. పట్టిసీమ దండగ అని దుష్ప్రచారం చేశారని... కానీ ఇప్పుడు వారికి అదే దిక్కైందని అన్నారు. ఆర్బీకేలాంటి దరిద్రమైన వ్యవస్థను తెచ్చి.. రైతులను దగా చేస్తున్నారని ధ్వజమెత్తారు.

Etv BharatChandrababu criticized the YCP government

author img

By

Published : Aug 16, 2023, 8:12 PM IST

Chandrababu Criticized YCP Government: వైసీపీ ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారింది: చంద్రబాబు

Chandrababu Fires on CM Jagan in Rachabanda Program: వైసీపీ ప్రభుత్వం... రైతుల పాలిట శాపంగా మారిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసమర్థ నిర్ణయాలతో... వ్యవసాయ రంగాన్ని కుదేలు చేశారని మండిపడ్డారు. ప్రాజెక్టులను అటకెక్కించి... చుక్క నీరు లేకుండా చేశారన్నారు. కోనసీమ జిల్లా మండపేట మండలం ఏడిదలో రైతులతో చంద్రబాబు రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన వైసీపీ ప్రభుత్వంపై (YCP government) తీవ్ర విమర్శలు గుప్పించారు. పట్టిసీమ దండగ అని దుష్ప్రచారం చేశారని.. కానీ ఇప్పుడు వారికి అదే దిక్కైందని అన్నారు. ఆర్బీకేలాంటి దరిద్రమైన వ్యవస్థను తెచ్చి... రైతులను దగా చేస్తున్నారని ధ్వజమెత్తారు. అన్నదాతల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతులను రాజులు చేసే బాధ్యత తెలుగుదేశం తీసుకుంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు.

రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి: జగన్ రోజుకో పథకం పేరుతో సొంత పత్రిక​లో ప్రకటనలిస్తూ కోట్లు సంపాదిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. సీఎం జగన్ చేనేత కార్మికులకు(Handloom workers) ఏం చేశాడో చెప్పాలని సవాల్ విసిరారు. జగన్ వచ్చే ఎన్నికల్లో సైతం ప్రజల ముందుకు వచ్చి మళ్లీ అబద్ధాలు చెబుతారని ఆరోపించారు. గిట్టూబాటు ధర కల్పించకపోవడంతో.. ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు నెలకొన్నాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 250 మంది చేనేత కార్మికులు ఉన్న ఏడిద గ్రామంలో.. సీఎం జగన్ బటన్ నొక్కితే కేవలం 35 మందికి మాత్రమే రూ.24వేలు వస్తున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. మిగితా 215 మంది పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. చేనేత వృత్తి చేసే వారి పరిస్థితి దయనీయంగా ఉందని, అలాంటి వారి కోసం కొత్త విధానాన్ని తీసుకువచ్చే ప్రయత్నం చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.

రాజధానులు కడతారా?: పోలవరం ప్రాజెక్టును (Polavaram project) సీఎం జగన్‌ మూలన పడేశారన్న చంద్రబాబు.. జగన్‌ అసమర్థ పాలన రైతుల పాలిట శాపంగా మారిందని విమర్శించారు. పురుషోత్తపట్నం ప్రాజెక్టుల్లో నీరు లేక రైతులకు అవస్థలు పడుతున్నరని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో రైతులకు కనీసం గోనె సంచులు కూడా జగన్‌ ఇవ్వలేకపోతున్నారని చంద్రబాబు విమర్శించారు. గోనెసంచులు ఇవ్వలేని సీఎం.. 3 రాజధానులు కడతారా? అంటూ ఎద్దేవా చేశారు. కొబ్బరి రైతులకు సైతం గిట్టుబాటు ధర కల్పించడం లేదని చంద్రబాబు దయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వంలో ఆక్వా కల్చర్ వెంటిలేటర్‌పై ఉందంటూ చంద్రబాబు విమర్శలు గుప్పించారు.

పర్యటన వివరాలు: మధ్యాహ్నం రాజమహేంద్రవరంలో నుంచి బయల్దేరిన ఆయన... ఆలమూరు మండలం మడికి, కడియం మడలం దుళ్లలో రోడ్‌ షో చేశారు. కాటన్, ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆ తర్వాత చింతాలమ్మ ఆలయాన్ని దర్శించుకున్నారు. మార్గం వెంబడి గజమాలతో చంద్రబాబుకు అభిమానులు స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులు ఇచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.