BOAT: కోనసీమ జిల్లా లంకల గన్నవరం గ్రామానికి చెందిన లంకె తాతమ్మ అనే పడవ నిర్వాహకుడు తన ఇల్లు మునిగిపోయి, భార్య అనారోగ్యంతో బాధపడుతున్న పరిస్థితుల్లోనూ సాటివారి కోసం ఆలోచించారు. నాలుగు రోజులుగా గ్రామానికి చెందిన వరద బాధితులను తన పడవలో తరలిస్తున్నాడు. ఆయన భార్య కృష్ణవేణి 5 నెలలుగా తీవ్ర అనారోగ్యంతో మంచానపడ్డారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ పరిస్థితుల్లోనే గ్రామం పూర్తిగా ముంపుబారినపడింది. తాతమ్మ ఇల్లు వరద నీటిలో మునిగిపోయింది. అనారోగ్యంతో ఉన్న భార్యను డాబా ఇంటిపై ఉంచి.. వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు చేరవేస్తున్నారు. రెండేళ్ల క్రితం బాధితులను పడవ దాటించినా ప్రభుత్వం నుంచి బకాయిలు అందలేదని తాతమ్మ చెబుతున్నారు. అయినప్పటికీ వరద బాధితులను తాతమ్మ పడవపై చేరవేస్తున్నారు. ఈసారైనా పూర్తిగా డబ్బులు చెల్లిస్తే చాలని అంటున్నారు.
ఇవీ చదవండి: