FLOODS IN KONASEEMA: గోదావరికి వరదలు పెరుగుతున్న కారణంగా..... కోనసీమ జిల్లాలో లంక గ్రామాలు జల దిగ్బంధమయ్యాయి. ప్రజలు రోజువారీ జీవనం గడపడం కష్టతరంగా మారింది. రాకపోకలు కూడా సాగించలేని స్థితి నెలకొంది. కోనసీమ జిల్లాలో సుమారు 40 లంక గ్రామాలను గోదావరి వరద చుట్టుముట్టింది. లక్షకు పైగా జనాభా వరద బాధితులుగా ఉన్నారు. కాజ్ వేలు ఎక్కడికక్కడ ముంపునకు గురయ్యాయి. నిత్యావసరాల కోసం ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కనీస అవసరాల కోసం కూడా మర పడవలపై ప్రమాదకర ప్రయాణాలు చేస్తున్నారు. పి.గన్నవరం మండలం బూరుగులంక అరిగెలవారిపేట, ఉడుముడిలంక, జి.పెదపూడిలంక గ్రామాల ప్రజల కోసం..... గోదావరిపై వంతెన నిర్మించకపోవడం వల్ల తమకు ఇబ్బందులు తప్పడం లేదని... స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి: