- దిల్లీకి అమరావతి రైతులు.. మూడు రోజులు ఆందోళన
ఏకైక రాజధాని అమరావతి నినాదాన్ని ఎలుగెత్తి చాటేందుకు రాజధాని ప్రాంత రైతులు దిల్లీ పయనమయ్యారు. విజయవాడ నుంచి ప్రత్యేక రైలులో హస్తినకు బయల్దేరారు. మూడ్రోజుల పాటు దేశ రాజధానిలో వివిధ కార్యక్రమాలు చేపట్టనున్న రైతులు.. అమరావతి ఉద్యమానికి జాతీయస్థాయిలో మద్దతు కూడగట్టేలా ప్రణాళికలు రూపొందించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మరో 16 నెలల్లో ఎన్నికలు.. ఎమ్మెల్యే ప్రతి ఇంటికీ వెళ్లాలి: సీఎం జగన్
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు, నేతలతో భేటీ అయిన సీఎం జగన్ నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ తమ ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకురుతుందనివెల్లడించారు. మరో 16 నెలల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో నియోజకవర్గంలో ఎమ్మెల్యే విస్తృతస్థాయిలో పర్యటించాలని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- నారా లోకేశ్‌తో.. కేజీఎఫ్ ఫేమ్ యశ్ భేటీ
ప్రముఖ సినీ నటుడు, కేజీఎఫ్ ఫేమ్ యశ్.. హైదరాబాద్‌లో తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను కలిశారు. దాదాపు అరగంట పాటు ఈ సమావేశం సాగింది. భేటీలో ఏ అంశాలు చర్చకొచ్చాయో ఇప్పటివరకు తెలియకపోయినా... వీరిద్దరూ కలవడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 2023లో ప్రభుత్వ సెలవులు ఎన్నో తెలుసా..!
2023 సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ సాధారణ సెలవు తేదీలను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. వివిధ పర్వదినాలు, జాతీయ సెలవు దినాల తేదీలను సూచిస్తూ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్ జవహర్ రెడ్డి నోటిఫికేషన్ జారీ చేశారు. 2023 ఏడాదిలో మొత్తంగా 23 రోజులను సాధారణ సెలవుదినాలుగా పేర్కోంటూ నోటిఫికేషన్ జారీ చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- KGFలో మళ్లీ పసిడి వేట.. తెరుచుకోనున్న కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ తలుపులు!
కేజీఎఫ్ ఈ పేరు వినగానే యశ్ హీరోగా.. నటించిన సినిమా గుర్తుకు వస్తోంది. ఆ సినిమాలో చూపించినదంతా నిజం కాకపోయినా.. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఒకప్పుడు బంగారు కొండలు. వేల కిలోల స్వర్ణాన్ని కేజీఎఫ్ నుంచి వెలికితీశారు. దాదాపు 20 ఏళ్ల క్రితం మూసేసిన కేజీఎఫ్ తలుపులు మళ్లీ తెరుచుకోనున్నాయి. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లో బంగారాన్ని వెలికితీయాలని భారత ప్రభుత్వం యోచిస్తోంది. 50 మిలియన్ టన్నుల శుద్ధి చేసిన ఖనిజం నుంచి బంగారాన్ని వెలికి తీసేందుకు.. బిడ్‌లు ఆహ్వానించాలని కేంద్రం సమాలోచనలు చేస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- హాస్టల్‌కు వచ్చి HM లైంగిక వేధింపులు.. కర్రలు, చీపుర్లతో చితకబాదిన అమ్మాయిలు
విద్యాబుద్ధులు నేర్పాల్సిన ప్రధానోపాధ్యాయుడే స్టూడెంట్స్‌ను లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆగ్రహానికి లోనైన విద్యార్థినులు హెడ్మాస్టర్ను కర్రలు, చీపుర్లతో కొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- చైనాలో కరోనా మహమ్మారి విజృంభణ.. ఆస్పత్రుల వద్ద జనం బారులు!
చైనాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. అక్కడ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. పలు చోట్ల ఆస్పత్రుల వెలుపల రోగులు క్యూకడుతున్న దృశ్యాలు బయటకొచ్చాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మరోసారి టెస్లా షేర్లను విక్రయించిన మస్క్.. కారణం చెప్పని కుబేరుడు
ట్విట్టర్ కొనుగోలుకు కావాల్సిన నిధుల్లో కొంత మొత్తాన్ని మస్క్ సొంతంగా సమకూర్చుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన భారీ ఎత్తున షేర్లను విక్రయిస్తున్నారు. తాజాగా మరోసారి 22 మిలియన్ల షేర్లు అమ్మేశారు. అయితే, దానికి కారణం మాత్రం మస్క్ వెల్లడించలేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఇషాన్ కిషన్ మరో విధ్వంసం.. రంజీ ట్రోఫీలో సెంచరీ.. దుమ్మురేపుతున్నాడుగా..
టీమ్ఇండియా యువ ఆటగాడు ఇషాన్ కిషన్ బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో డబుల్ సెంచరీ సాధించి వారం కూడా కావట్లేదు. ఇంతలోనే రంజీ ట్రోఫీలో శతకం బాది ఔరా అనిపించుకుంటున్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'బేషరమ్ రంగ్' దుమారం.. షారుక్ స్ట్రాంగ్ కౌంటర్!
'బేషరమ్ రంగ్' పాట విషయంలో సోషల్‌మీడియాలో విమర్శలపై కథానాయకుడు షారుక్ తనదైన శైలిలో స్పందించారు. ప్రేక్షకులు, అభిమానులు తమని ప్రేమిస్తున్నంత కాలం ప్రపంచం ఏమనుకుంటుంది? ఏం చేస్తుందన్న విషయాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని బాలీవుడ్ నటుడు షారుఖ్‌ఖాన్ అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.