ETV Bharat / state

వైఎస్సార్సీపీలో ప్రకంపనలు - అధిష్ఠానం నిర్ణయంపై నిరసన జ్వాలలు - YCP Incharges Change

YSRCP Leaders Protest Against Incharges Change: నియోజకవర్గాల ఇన్​ఛార్జ్​ల మార్పు వైసీపీలో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. ఎన్నాళ్లగానో ఉన్న అసమ్మతికి తాజాగా విడుదలవుతున్న జాబితాలు ఆజ్యం పోస్తున్నాయి. ఎక్కడికక్కడ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అధిష్ఠానం నిర్ణయం మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వైసీపీ నేతలు హెచ్చరిస్తున్నారు.

YSRCP Leaders Protest Against Incharges Change

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 12, 2024, 9:41 PM IST

YSRCP Leaders Protest Against Incharges Change: నియోజకవర్గాలలో ఇన్​ఛార్జ్​ల మార్పుపై వైసీపీలో అసమ్మతి సెగలు బయటపడుతున్నాయి. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజవర్గంలో ఇన్‌ఛార్జ్‌ మార్పుపై వైసీపీలో ధిక్కార స్వరం పెరుగుతోంది. స్థానిక ఎమ్మెల్యే పెండెం దొరబాబు పుట్టినరోజు సందర్భంగా క్యాంప్ కార్యాలయంలో ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు. దీంతో ఈ వేడుకలు దొరబాబు టికెట్ కోసం బల ప్రదర్శనకు వేదికయ్యాయి. వచ్చినవారు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ నియోజకవర్గంలో మీకే టికెట్ రావాలని నినదించారు.

అయితే ఎమ్మెల్యే దొరబాబు పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి జగన్ ఫోటో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతను ఇటీవల పిఠాపురం నియోజకవర్గ ఇన్​ఛార్జ్​గా పార్టీ ప్రకటించింది. దీంతో అప్పటి నుంచి దొరబాబు అసంతృప్తితో ఉన్నారు. జనసేనలో చేరతారని ప్రచారం జరుగుతోంది.

నియోజవర్గం ఇన్​ఛార్జ్​ మార్పుపై స్పందించిన దొరబాబు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు. ఈరోజు జరిగిన వేడుకలో సుమారు 50 వేల మంది తరలివచ్చి తనకు మద్దతు తెలిపారు అన్నారు. నియోజకవర్గ ప్రజానీకం తననే కోరుకుంటుందని, మళ్లీ ఎమ్మెల్యే టికెట్ తనకి ఇస్తే భారీ మెజార్టీతో గెలిచి చూపిస్తానన్నారు. పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఇప్పటి వరకు తాను ఏ రాజకీయ పార్టీని సంప్రదించలేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్ ఆలోచించుకుని తనకే టిక్కెట్ ఇస్తారని ఆశిస్తున్నానని తెలిపారు.

వైఎస్సార్సీపీలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఇన్​ఛార్జ్​ల మార్పు - అధిష్ఠానం నిర్ణయంపై నిరసన జ్వాలలు

వైఎస్సార్సీపీలో ముగిసిన మార్పులు చేర్పుల పర్వం- సిట్టింగులకు జగన్ మొండిచేయి

రెండు నెలల సమయం ఉంది ఏదైనా జరగొచ్చు: ఆలూరు ఎమ్మెల్యే టికెట్ కోసం విజయవాడలో ధర్నా చేసేందుకు సిద్ధమని మంత్రి గుమ్మనూరు జయరాం అనుచరులు స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా ఆలూరులోని తన నివాసంలో పార్టీ కార్యకర్తలు, నాయకులతో మంత్రి సమావేశమయ్యారు. ఎంపీగా పోటీ చేయాలని పార్టీ నిర్ణయించిందని, దీనిపై అభిప్రాయాలు చెప్పాలని మంత్రి కోరారు. ఆలూరు ఎమ్మెల్యేగానే పోటీ చేయాలని కార్యకర్తలు, నాయకులు స్పష్టం చేశారు. ఆలూరు టికెట్ కోసం విజయవాడలో ధర్నా చేస్తామన్నారు. కార్యకర్తల నిర్ణయాన్ని గౌరవిస్తానని, ఎన్నికలకు రెండు నెలల సమయం ఉందని, ఏదైనా జరగొచ్చని గుమ్మనూరు తెలిపారు.

పార్టీకి రాజీనామా చేస్తాం: కోడుమూరు నియెజకవర్గ వైసీపీలో అసమ్మతి జ్వాలలు చల్లారలేదు. టికెట్‌ దక్కని నేతలు, వారి అనుచరులు పార్టీ అధిష్ఠానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా ఆదిమూలపు సతీష్‌ను ప్రకటించడంతో మాజీ ఎమ్మెల్యే మురళీ కృష్ణ అభిమానులు, మద్దతుదారులు కర్నూలులో ఆందోళనకు దిగారు. స్థానికేతరులకు టికెట్ ఎలా కేటాయిస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మురళీకృష్ణ ఇంటి వద్ద ఆందోళన చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే మురళీ కృష్ణకు టికెట్‌ కేటాయించాలని లేకుంటే పార్టీకి రాజీనామా చేస్తామని హెచ్చరించారు.

వైఎస్సార్సీపీలో గొంతెత్తి ప్రశ్నిస్తే - వేటేస్తారు జాగ్రత్త సుమీ!

అది తప్పని తెలిసింది: ప్రతిపక్షాలపై దౌర్జన్యాలు చేయకపోవడం, అసభ్య పదజాలం వాడకపోవటమే తన అసమర్ధతగా వైఎస్సార్సీపీ అధిష్టానం భావించి ఉండొచ్చని కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఏ అర్హత లేదని మంత్రి పదవి ఇవ్వలేదో తెలీదని వ్యాఖ్యానించారు. బీసీలకు వైఎస్సార్సీపీలో అగ్ర తాంబూలం అనేది నేతి బీర కాయలో నెయ్యి తరహానేనని విమర్శించారు. బలహీన వర్గాలకు వైఎస్సార్సీపీలో గుర్తింపు ఉంటుందని, గతంలో తానూ చెప్పిన వాడినేనన్న పార్థసారథి, కానీ అది తప్పని తెలుసుకోవటానికి ఎంతో సమయం పట్టలేదని తెలిపారు. బీసీలు, దళితులు ఎవరి కాళ్ల మీద వాళ్లు నిలబడాలనుకుంటారన్నారని, కానీ ఒకరి కాళ్ల కింద, ఎవరి పెత్తనం మీదో ఆధారపడాల్సి వస్తే తనలా ఆత్మాభిమానం మాత్రం చంపుకోలేరని స్పష్టం చేశారు.

YSRCP Changing Constituency Incharges : గన్నవరంలో అధికార పార్టీ గెలిచే పరిస్థితి లేదని, తనను ఆ స్థానానికి పంపాలని చూశారని పార్థసారధి అసంతృప్తి వ్యక్తం చేశారు. బీసీ నేతను కాబట్టి తాను గన్నవరంలో ఓడిపోయినా పర్లేదని అధిష్టానం భావించి ఉండవచ్చని ఆయన అన్నారు. తాను గన్నవరం వెళ్లేందుకు విభేదించటంవల్లే పార్టీకి నచ్చనందుకే వేరొకరికి పెనమలూరు టికెట్ ఇచ్చిందని అభిప్రాయపడ్డారు. పెనమలూరు టికెట్‌ పొందిన జోగి రమేష్​కు కొలుసు పార్థసారధి అభినందనలు తెలిపారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.