Meat Lovers In Yanam: సంప్రదాయ సంక్రాంతి పండుగలో మూడో రోజు కనుమ. పండుగ సోమవారం కావడంతో చాలావరకు మాంసాహారులు మరణించిన పెద్దలకు నైవేధ్యంగా పెట్టుకున్నారు తప్ప ఇంటిళ్లిపాదీ పండగ విందు భోజనంగా మాంసాహారం స్వీకరించలేదు. ముక్కనుమ మంగళవారం కావడంతో మాంసాహార ప్రియులంతా ఉదయం నుంచే చికెన్, మటన్ షాపుల వద్దకు చేరుకున్నారు. దీంతో బాగా రద్దీ పెరిగింది.
గంట పాటు ట్రాఫిక్ అంతరాయం: కాకినాడ జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం యానాంలోకి ప్రవేశ రహదారికి ఇరుప్రక్కల చికెన్, మటన్ సెంటర్లు 20 వరకు ఉంటాయి. వ్యాపారస్తుల మధ్య పోటీతో చికెన్ కిలో 140 నుండి 180 రూపాయలు వరకు, మటన్ కిలో 600 నుండి 900 రూపాయలు వరకు అమ్మకాలు జరుగుతుంటాయి. సంక్రాంతి ముక్కనుమ మంగళవారం కావడంతో కొనుగోలుదారుల తాకిడి భారీగా పెరిగింది. యానాం నుండి తాళ్ళరేవుకు వేళ్ళే ప్రధాన రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిపివేశారు. దీని ప్రభావంతో సుమారు గంట పాటు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఇతర ప్రాంతాల్లో కన్నా ఇక్కడ నాణ్యమైన మాంసాహారాన్ని తక్కువ ధరకు విక్రయిస్తుండడంతో ముమ్మిడివరం తాళ్ళరేవు, ఐ.పోలవరం మండలాల నుండి అధిక సంఖ్యలో కొనుగోలుదారులు రావడంతో వ్యాపారులకు అధిక లాభాలను అర్జించారు.
ఇవీ చదవండి