ప్రముఖ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి తల్లి రెడ్డి చిట్టెమ్మ (93) అనారోగ్యంతో ఈ ఉదయం కన్నుమూశారు. కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిట్టెమ్మ తుదిశ్వాస విడిచారు. బంధువులు ఆమె భౌతికకాయాన్ని స్వస్థలం కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం మల్లంపేటకు తరలించారు. ఆ సమయానికి విజయనగరంలో ఉన్న ఆర్.నారాయణమూర్తి తల్లి మరణ వార్త విని స్వగ్రామం చేరుకున్నారు. తల్లి భౌతికకాయంపై పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు.
చిట్టమ్మె ఏడుగురు సంతానంలో ఆర్.నారాయణమూర్తి మూడోవాడు. తన తల్లి ప్రోత్సాహం వల్లే తాను సినిమా రంగంలోకి ప్రవేశించి నటుడిగా గుర్తింపు సాధించానని నారాయణ మూర్తి గుర్తు చేసుకున్నారు. నాన్న అంటే చాలా భయంగా ఉండేదని, ఆయన కంటే అమ్మతోనే చనువు ఎక్కువగా ఉండేదని పాతజ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు సినీనటుడు ఆర్ నారాయణమూర్తి. ఎంతో పేదరికంలో ఉన్నప్పటికీ, సినిమాల్లో నటిస్తానంటే అప్పట్లో అమ్మ రూ. 70 ఇచ్చిందని, ఆ డబ్బుతోనే మద్రాసు వెళ్లానని నారాయణమూర్తి చెప్పుకొచ్చారు.
ఇవీ చూడండి