PHARMACY STUDENTS PROTEST : విద్యా దీవెన పథకం ద్వారా ఫీజులు చెల్లించాలంటూ కాకినాడ కలెక్టరేట్ స్పందన వద్ద ఫార్మసీ విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. ఆరు సంవత్సరాల కోర్సులో మూడేళ్ల ఫీజులే అందాయని.. ప్రస్తుతం ఫీజు నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా దీవెన నుంచి తమ పేర్లు తొలగింపుపై కలెక్టర్కు పలుసార్లు విజ్ఞప్తి చేసినా.. న్యాయం జరగలేదని అన్నారు. పేద వర్గాలకు చెందిన తమకు విద్యా దీవెన ద్వారా ఫీజు చెల్లించక పోవడం వల్ల చదువు నిలిచిపోయే పరిస్థితి నెలకొందని ఫార్మసీ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: