Lack of Facilities in Jagananna Colony: నివాసయోగ్యంగా మార్చాల్సిన జగనన్న కాలనీల్లో నిర్మాణాలు చేపట్టేందుకూ వసతుల్లేక లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. ప్రతి కాలనీల్లో తాగునీరు, రహదారులు, విద్యుత్తు వంటి సదుపాయాలు కల్పించాలి. కానీ క్షేత్రస్థాయిలో ఇవేవీ కనిపించడం లేదు. కాకినాడ జిల్లా జగ్గంపేట దివాన్ తోట ప్రాంతంలో 'నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు' పథకం కింద 2,800 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. సౌకర్యాల్లేకున్నా 30 శాతం మంది నిర్మాణాలు చేశారు. కొందరు గృహ ప్రవేశాలూ చేశారు. ఇప్పటికీ కాలనీకి విద్యుత్తు సరఫరా ఇవ్వలేదు. అధికారులు స్తంభాలు వేసి వదిలేశారు. దీంతో కాలనీ వాసులు వందల మీటర్ల దూరం నుంచి కర్రల సాయంతో సర్వీసు తీగలు లాక్కున్నారు. వర్షం కురిసినా, గాలి వీచినా కర్రలు పడిపోతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రహదారి, విద్యుత్తు వంటి సదుపాయాలైనా కల్పించాలని కోరుతున్నారు.
ఇవీ చదవండి: