ETV Bharat / state

తుని ఘటనపై మంత్రి దాడిశెట్టి రాజా ఏమన్నారంటే..?

author img

By

Published : Nov 17, 2022, 9:12 PM IST

Minister Dadisetti Raja: కాకినాడ జిల్లా తునిలో తెదేపా నేత మీద జరిగిన హత్యాయత్నంపై మంత్రి దాడిశెట్టి రాజా స్పందించారు. వ్యక్తుల మీద దాడి చేసే సంస్కృతి తమది కాదని స్పష్టం చేశారు.

Minister Dadisetti Raja
మంత్రి దాడిశెట్టి రాజా

Minister Dadisetti Raja comments: కాకినాడ జిల్లా తునిలో తెదేపా నేత, మాజీ ఎంపీపీ పొల్నాటి శేషగిరిరావు మీద జరిగిన హత్యాయత్నంపై మంత్రి దాడిశెట్టి రాజా స్పందించారు. వ్యక్తుల మీద దాడి చేసే సంస్కృతి మాది కాదన్నారు. యనమల రామకృష్ణుడు వల్ల, వాళ్ల తమ్ముడు వల్ల గత 40 ఏళ్లలో 40 హత్యలు జరిగాయని హత్యకు గురైన వారి ఫొటోలతో హైదరాబాద్​లో మీ ఇంటి ముందు ఫ్లెక్సీలు పెడతానని ఆయన స్పష్టం చేశారు.

మంత్రి దాడిశెట్టి రాజా

అసలేం జరిగింది: తుని.. గురువారం ఉదయం 6 గంటల సమయం.. తెదేపా నేత, మాజీ ఎంపీపీ పొల్నాటి శేషగిరిరావు ఇంటికి గుర్తుతెలియని వ్యక్తి భవాని మాలధారణలో భిక్ష కోసం వచ్చారు. శేషగిరిరావు బియ్యం వేస్తుండగా ఒక్కసారిగా కత్తి బయటకు తీశాడు. తలపై నరికేందుకు యత్నించగా.. అప్రమత్తతో ఉన్న శేషగిరిరావు వెంటనే తప్పించుకున్నారు. కానీ మరోసారి చేతిపై దాడి చేసిన దుండగుడు.. వెంటనే అక్కడినుంచి బయటకు వెళ్లిపోయాడు. అనంతరం బైక్​పై పరారయ్యాడు. శేషగిరిరావు చేతికి, తలకు తీవ్రగాయాలు కాగా.. కుటుంబసభ్యులు వెంటనే కాకినాడలోని అపోలో ఆసుపత్రికి తరలించారు.

కాకినాడ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శేషగిరిరావును యనమల రామకృష్ణుడు, చినరాజప్ప, కొండబాబు సహా ఇతర తెదేపా నేతలు పరామర్శించారు. మంత్రి దాడిశెట్టి రాజా అనుచరులే దాడి చేశారని ఆరోపించారు. వైకాపా ఆగడాలకు తుని జనం భయభ్రాంతులకు గురవుతున్నారని మండిపడ్డారు.

శేషగిరిరావుపై హత్నాయత్నాన్ని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఖండించారు. మంత్రి దాడి శెట్టి రాజా అవినీతి, అక్రమాలపై పోరాడినందుకే శేషగిరిరావుని హత్య చెయ్యాలని కుట్ర పన్నారని ఆరోపించారు. జగన్ గొడ్డలిపోటును మంత్రులు, ఎమ్మెల్యే లు వారసత్వంగా తీసుకున్నారని విమర్శించారు. అన్యాయాలను నిలదీసే తెదేపా నేతల గళాలను.. అణిచివేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాన్​ను నమ్ముకుంటే లాభం లేదని వైకాపా నేతలు కత్తిని నమ్ముకుంటున్నారని ధ్వజమెత్తారు.

ఇవీ చదంవడి:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.