ETV Bharat / state

జయలక్ష్మి సొసైటీలో భారీ కుంభకోణం.. న్యాయం కోసం బాధితుల ఎదురుచూపులు - Jayalakshmi Co operative Society Fraud in Kakinada

Jayalakshmi Co Operative Society: ఆరు జిల్లాలు, 29 శాఖలు, 520 కోట్ల రూపాయలకు పైగా డిపాజిట్లు, 20 వేల మంది ఖాతాదారులు నేనేమీ బ్యాంకు లెక్కలు చెప్పడం లేదండి బాబు.. ఖాతాదారులందరూ కేవలం ఒకే ఒక్క సోసైటీని నమ్మడం వల్ల రోడ్డున పడ్డారు. అసలు వారు ఎందుకు రోడ్డున పడాల్సి వచ్చిందో చూద్దామా..

Jayalakshmi Co Operative Society
జయలక్ష్మీ కో ఆపరేటీవ్ సొసైటీ
author img

By

Published : Apr 7, 2023, 1:17 PM IST

Updated : Apr 7, 2023, 2:23 PM IST

జయలక్ష్మి సొసైటీలో భారీ కుంభకోణం

Jayalakshmi Co Operative Society : అన్ని బ్యాంకుల కంటే అధిక వడ్డీ ఇస్తాం.. కేవలం 20 నెలల్లో మీ సొమ్ము రెట్టింపు అవుతుందంటూ ప్రచారం చేశారు. జయలక్ష్మీ సొసైటీలో పొదుపు - మీ ప్రగతికి మలుపు అని విశ్రాంత ఉద్యోగుల నుంచి కాకినాడలో భారీగా డిపాజిట్లు సేకరించారు. నిర్వాహకులు నిధుల్ని దారి మళ్లించారు. తరువాత బోర్డు తిప్పేశారు. ఖాతాదారులు మాత్రం డబ్బుల కోసం ఏడాది కాలంగా కాళ్లరిగేలా తిరుగుతున్నారు.

ఆరు జిల్లాలు, 29 శాఖలు, 520 కోట్ల రూపాయలకు పైగా డిపాజిట్లు, 20 వేల మంది ఖాతాదారులతో కాకినాడ కేంద్రంగా కార్యకలాపాలు సాగించిన ది జయలక్ష్మీ మ్యూచ్‌వల్ ఎయిడెడ్ మల్టీ పర్పస్ కో ఆపరేటివ్ సొసైటీ సంస్థ బోర్డు తిప్పేసి ఏడాది గడిచింది. ఇతర బ్యాంకుల కన్నా అధిక వడ్డీ ఇస్తామనే ప్రచారంతో వేలాది మంది విశ్రాంత ఉద్యోగులు పిల్లల చదువులు, పెళ్లిళ్లకు ఉపయోగపడతాయనే ఆశతో సొసైటీలో డబ్బులు దాచుకున్నారు. అయితే సొసైటీ పాలక వర్గం, ఇతర సభ్యులు కుమ్మక్కై నిధులు దుర్వినియోగం చేయడంతో గత సంవత్సరం ఏప్రిల్‌లో సంస్థ బోర్డు తిప్పేసింది. వృద్ధులైన పొదుపు దారుల్ని నడి రోడ్డున పడేసింది.

డబ్బుల కోసం జయలక్ష్మీ సొసైటీ బాధితులు చేయని ప్రయత్నం లేదు. ప్రజా ప్రతినిధులకు, ఉన్నతాధికారులకు మెుర పెట్టుకున్నారు. ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. వడ్డీలతో కలిపి సుమారు 523 కోట్ల రూపాయల్ని చెల్లించాల్సి ఉంటే రుణాల రూపంలో సంస్థకు రావాల్సింది 704 కోట్ల రూపాయల వరకు ఉందని బాధితులు చెబుతున్నారు. కేసులున్నా అధికార, రాజకీయ నేతల దన్నుతో యాజమాన్యం కొన్ని ఆస్తులు విక్రయించిందని బాధితులు ఆరోపిస్తున్నారు.

జయలక్ష్మీ సొసైటీ కేసును సీబీసీఐడీకి అప్పగించడంతో ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌లతో పాటు ఇతర డైరెక్టర్ల ఆస్తులను అధికారులు సీజ్‌ చేశారు. సొసైటీ నూతన కమిటీ ఛైర్మన్‌ గంగిరెడ్డి త్రినాథరావు ఆధ్వర్యంలోని కొత్త పాలక వర్గం రుణ గ్రహీతలకు నోటీసులు ఇస్తూ డిపాజిట్లు వెనక్కి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది.

జయలక్ష్మీ సోసైటీ బాధితుల్లో ఇప్పటికే 30 మంది మరణించారు. మరో 35 మంది అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.

"5 లక్షలు పొదుపు చేశాము. మా పాప వివాహం కోసం 3 లక్షలు తీసుకున్నాం. ఇంకా 2 లక్షలు ఉన్నాయి. అప్పుడప్పుడు వచ్చి వడ్డీ మాత్రమే తీసుకునేవాళ్లం. అసలు అవసరానికి తీసుకోవచ్చని అలాగే ఉంచాం. మా ఆయన ఆర్టీసీలో పని చేసేవారు. ఆయనకు గత ఆరు నెలలుగా ఆరోగ్యం బాగోలేదు. ట్రీట్​మెంట్ కోసం డబ్బులు లేవు." - వృద్ధ బాధితురాలు

" అధిక వడ్డీ వస్తుందనే ఆశతో నాతో పాటు చాలా మంది డిపాజిట్ చేశారు. దాదాపు 20 వేల మందిని మోసం చేశారు. మమల్ని ప్రభుత్వం ఆదుకోవాలని విన్నవించుకుంటున్నాము. " - బాధితుడు

" సీబీసీఐడీ వారు ఆరు నెలల నుంచి పర్యవేక్షణ చేస్తున్నారు. వాళ్లు కొన్ని ఆస్తులు సీజ్ చేయడం జరిగింది. డబ్బులు మాకు జమ చేస్తామని చెప్తున్నారు. " - గంగిరెడ్డి త్రినాథరావు, జయలక్ష్మీ సొసైటీ నూతన కమిటీ ఛైర్మన్‌

ఇవీ చదవండి

Last Updated : Apr 7, 2023, 2:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.