ETV Bharat / state

JanaSena Leader Nadendla Manohar Fire on CM Jagan: "విద్య పేరిట సీఎం జగన్ వందల కోట్లు విదేశీ సంస్థలకు దోచిపెడుతున్నారు" - Nadendla Manohar comments

JanaSena Leader Nadendla Manohar Fire on CM Jagan: ప్రభుత్వ ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వలేని ముఖ్యమంత్రి విద్య పేరిట వందల కోట్లు విదేశీ సంస్థలకు దోచి పెట్టేందుకు ఒప్పందాలు చేసుకుంటున్నారని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ-జనసేన పార్టీ కలిసి పోటీ చేస్తాయని, దీనికి కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని నాదెండ్ల మనోహర్‌ సూచించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వివిధ ప్రమాదాల్లో చనిపోయిన జనసేన కార్యకర్తల కుటుంబాలకు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు.. 66లక్షల విలువైన చెక్కుల్ని కాకినాడలో ఆయన అందజేశారు.

JanaSena Leader Nadendla Manohar Fire CM Jagan

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 20, 2023, 12:23 PM IST

Updated : Oct 20, 2023, 12:29 PM IST

19813950JanaSena Leader Nadendla Manohar Fire on CM Jagan: "విద్య పేరిట సీఎం జగన్ వందల కోట్లు విదేశీ సంస్థలకు దోచిపెడుతున్నారు"

JanaSena Leader Nadendla Manohar Fire on CM Jagan : ప్రభుత్వ ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వలేని ముఖ్యమంత్రి విద్య పేరిట వందల కోట్లు విదేశీ సంస్థలకు దోచి పెట్టేందుకు ఒప్పందాలు చేసుకుంటున్నారని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ (JanaSena Party PAC Chairman Nadendla Manohar) ఆరోపించారు. IB అనే విదేశీ సంస్థకు ఉపాధ్యాయులకు శిక్షణ పేరిట ఏటా 3వేల 500 కోట్లు చెల్లించేందుకు సిద్ధమవుతున్నారని మండిపడ్డారు.

ఇప్పటికే బైజ్యూస్ ద్వారా వందల కోట్ల కుంభకోణం జరిగిందని.. దీనిపై న్యాయ సమీక్ష ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. జెనీవాలో ఉన్న IB సంస్థతో ఒప్పందాలకు అధికారులు వ్యతిరేకించినా.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎందుకు ఒప్పందం చేసుకున్నారో (CM Jagan on Education System) సమాధానం చెప్పాలని మనోహర్ నిలదీశారు.

JanaSena Party And TDP Alliance in AP : రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ-జనసేన పార్టీ కలిసి పోటీ చేస్తాయని, దీనికి కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని నాదెండ్ల మనోహర్‌ సూచించారు. గురువారం కాకినాడ సూర్యకళామందిరంలో కాకినాడ నగర జనసేన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ-జనసేన అధికారంలోకి వస్తేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని అన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని తెలిపారు. కొన్నిచోట్ల త్యాగాలకూ సిద్ధంగా ఉండాలని పెర్కొన్నారు.

Janasena Nadendla Manohar on CM Jagan పోలీసులు లేకుండా ఎమ్మెల్యేలు గడప గడపకు కార్యక్రమం నిర్వహించాలి: నాదెండ్ల మనోహర్

వైసీపీని సాగనంపడానికి ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని నాదెండ్ల మనోహర్‌ సూచించారు. ప్రశాంతమైన కాకినాడ నగరం వైసీపీ పాలనలో గంజాయి, భూ కబ్జాలకు అడ్డాగా మారిపోయిందని.. సుందరమైన నగరాన్ని మురుగుకూపంలా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ సెజ్‌ను బంగాళాఖాతంలో కలిపేస్తామని చెప్పిన సీఎం జగన్‌, ప్రస్తుతం ఆ భూములను పరిశ్రమలకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. జగనన్న కాలనీల పేరుతో చాలా మందిని మోసం చేశారని మండిపడ్డారు. జనసేన పార్టీ కాకినాడ నగర అధ్యక్షుడు తోట సుధీర్‌ మాట్లాడుతూ కాకినాడలో టీడీపీ-జనసేన కలిసి ప్రచారం చేస్తాయని స్పష్టం చేశారు.

Janasena PAC Chairman Nadendla Manohar : చంద్రబాబు సుదీర్ఘ అనుభవం, పనన్ కల్యాణ్ ఆలోచనలు ఈ రాష్ట్రానికి చాలా అవసరం: నాదెండ్ల

Nadendla Manohar Distributed Checks to JanaSena Activists Died in Accidents : రూ.25 లక్షల అందజేత : ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వివిధ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన అయిదుగురు జనసేన క్రియాశీలక సభ్యుల కుటుంబాలను నాదెండ్ల మనోహర్‌ పరామర్శించారు. ముత్తాక్లబ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాధిత కుటుంబాలతో ఆయన మాట్లాడారు. మృతికి కారాణాలను అడిగి తెలుసుకున్నారు. వివిధ ప్రమాదాల్లో చనిపోయిన జనసేన కార్యకర్తల కుటుంబాలకు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు.. 66 లక్షల విలువైన చెక్కుల్ని కాకినాడలో నాదెండ్ల మనోహర్‌ అందజేశారు.

Nadendla Manohar Met with Janasena Leaders: టీడీపీ - జనసేన ఉమ్మడి కార్యచరణ సిద్ధమవుతోంది.. సమస్యలపై కలసి పోరాడదాం: నాదెండ్ల

Last Updated : Oct 20, 2023, 12:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.