ETV Bharat / state

ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు - ap latest news

రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయి. ఇందులో ఒక వ్యాపారితో పాటు వీఏఏ కీలకపాత్ర వహించినట్లు గుర్తించారు. కొబ్బరి తోటల సర్వే నెంబర్లతో, బినామీ రైతుల పేర్లతో దాదాపు రూ.35 లక్షల రూపాయల మేరకు ధాన్యం కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు.

అధికారి
అధికారి
author img

By

Published : May 22, 2022, 5:46 AM IST

ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు చోటుచేసుకున్నాయి. కొబ్బరి తోటల సర్వే నెంబర్లతో, బినామీ రైతుల పేర్లతో దాదాపు రూ.35 లక్షల రూపాయల మేరకు ధాన్యం కొనుగోలు చేసినట్లు నమోదైంది. ఇందులో ఒక వ్యాపారితో పాటు వీఏఏ కీలకపాత్ర వహించినట్లు గుర్తించారు. కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం నాగుల్లంక రైతు భరోసా కేంద్రంలో ఈ అవకతవకలు జరిగాయి.

వాస్తవానికి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలంటే యజమాని లేదా కౌలు రైతు పేరున ‘ఈ-క్రాప్‌’ బుకింగ్‌ జరగాలి. ఆ వివరాలు పీపీసీ (ప్యాడీ పర్చేజింగ్‌ సెంటర్‌)లోకి రావాలి. పండిన ధాన్యాన్ని రైతు ఆర్బీకే (రైతు భరోసా కేంద్రం)కి తీసుకురావాలి. అక్కడ తేమ శాతంతో పాటు, నాణ్యతను పరిశీలించాలి. ఇలాంటి ప్రక్రియ ఏమీ జరగలేదు. ఆ గ్రామంలో రైతులు కాదు కదా...కౌలు రైతులు కూడా లేరు. ఇతర ప్రాంతాలకు చెందిన వారి పేర్లతో నాగుల్లంక ఆర్బీకేలో ‘ఈ-క్రాప్‌’ బుకింగ్‌ చేశారు. ఆ వివరాలను ‘పీపీసీ’ పోర్టల్‌లో ఉంచి ధాన్యం కొనుగోలు చేసినట్లు నమోదు చేసి ఎఫ్‌.టి.ఒ.(ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆర్డర్‌)లు జనరేట్‌ చేశారు. ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తుల పేర్లు ఇందులో నమోదై ఉన్నాయి. గన్నవరం ఎ.డి.ఎ. ఎస్‌.జె.వి.రామోహనరావు దృష్టికి ఈ విషయాన్ని ‘న్యూస్‌టుడే’ తీసుకెళ్లింది. దాంతో ఆయనతో పాటు మండల వ్యవసాయాధికారి కె.ప్రవీణ్‌ హుటాహుటిన శనివారం నాగుల్లంక రైతు భరోసా కేంద్రానికి వెళ్లి వివరాలు సేకరించారు. అక్కడ పనిచేస్తున్న వి.ఎ.ఎ. ఎం.పూర్ణచంద్రవంశీ ఇతర ప్రాంతాలకు చెందిన తొమ్మిది మంది పేర్లతో ‘ఈ-క్రాప్‌’ బుకింగ్‌ చేసి వాటిని పీపీసీ పోర్టల్‌కు అనుసంధానం చేశాడని గుర్తించారు. ఈ నెల 9, 10 తేదీల్లో ఆ తొమ్మిది మంది పేరున ధాన్యం డబ్బులు చెల్లించేందుకు ఎఫ్‌.టి.ఒ.లు జనరేట్‌ అయ్యాయని, పైగా కొబ్బరి తోటలకు చెందిన సర్వే నెంబర్లను ‘ఈ-క్రాప్‌’ బుకింగ్‌లో నమోదు చేశారని ఏడీఏ రామోహనరావు వివరించారు. మొత్తం తొమ్మిది మంది బినామీ రైతుల పేరు మీద 1,785.60 క్వింటాళ్ల ధాన్యం కేంద్రాల ద్వారా కొనుగోలు చేసినట్లు ఉందని, దీని విలువ రూ.34.64లక్షలు అని ఆయన చెప్పారు. ప్రధానంగా ఒక ధాన్యం వ్యాపారి ఈ పేర్లు తెచ్చి వి.ఎ.ఎ.తో తప్పుడు నమోదు చేయించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అసలు ఆ ధాన్యం వ్యాపారి ఎవరు..? ఇలా ఇతర ఆర్బీకేల్లో కూడా చేశారా..? ‘ఈ-క్రాప్‌’ బుకింగ్‌లో లోపాలు ఎందుకు జరుగుతున్నాయి..? తదితర అంశాలపై ఉన్నతాధికారులు లోతుగా దర్యాప్తు చేయాలని పలువురు రైతులు కోరుతున్నారు.

కొబ్బరి తోటల సర్వే నెంబర్లు

నాగుల్లంక ఆర్‌బీకేలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి లోపాలు జరిగినట్లు పరిశీలనలో గుర్తించాను. కొబ్బరి తోటల సర్వే నంబర్లను ‘ఈ-క్రాప్‌’ బుకింగ్‌లో నమోదు చేశారు. ఇది కూడా తప్పు. లోపాలకు కారణమైన వి.ఎ.ఎ. పూర్ణచంద్రవంశీకి మెమో ఇచ్చాం. ఈ కేంద్రంతో పాటు ఇతర ఆర్బీకేల్లోనూ పరిశీలన చేస్తాం. లోపాలు ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. -ఎస్‌.జె.వి.రామమోహనరావు, ఎ.డి.ఎ., పి.గన్నవరం

ఇదీ చదవండి: అత్యధిక రోజులు.. అప్పు చేసిన రాష్ట్రం ఏపీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.