ETV Bharat / state

యనమల రామకృష్ణుడితో ఎలాంటి విభేదాలు లేవు: యనమల కృష్ణుడు - Kakinada District updated news

TDP Senior leader Yanamala Krishnudu comments: తుని నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ పదవి విషయంలో గతకొన్ని రోజులుగా యనమల రామకృష్ణుడు ఆయన సోదరుడు యనమల కృష్ణుడి మధ్య తీవ్రమైన విభేదాలు తలెత్తుతున్నాయని సామాజిక మాధ్యమాల వేదికగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఆ ప్రచారంపై యనమల కృష్ణుడు స్పందించారు. తనకు, తన సోదరుడు యనమల రామకృష్ణుడికి మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆయన స్పష్టతనిచ్చారు.

Yanamala Krishnudu
Yanamala Krishnudu
author img

By

Published : Feb 8, 2023, 6:07 PM IST

TDP Senior leader Yanamala Krishnudu comments: కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో గతకొన్ని రోజులుగా యనమల రామకృష్ణుడికి ఆయన సోదరుడు యనమల కృష్ణుడి మధ్య తీవ్రమైన విభేదాలు తలెత్తాయని సామాజిక మాధ్యమాల వేదికగా తెగ చర్చ జరుగుతోంది. టీడీపీ అధిష్ఠానం తుని నియోజకవర్గ బాధ్యతలను యనమల కృష్ణుడికి అప్పగించకుండా ఆయన సోదరుడు యనమల రామకృష్ణుడి పెద్ద కుమార్తె దివ్యకు అప్పగించడంతో.. యనమల కృష్ణుడు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారని, త్వరలోనే ఆయన వైసీపీ కండువాను కప్పుకోబోతున్నారని ప్రచారం జరిగింది.

ఈ క్రమంలో యనమల కృష్ణుడు ఆ ప్రచారాలపై స్పందించారు. తనకు, తన సోదరుడైన యనమల రామకృష్ణుడికి మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఇద్దరం తెలుగుదేశం పార్టీలోనే ఉన్నామని, ఇకపై కూడా అదే పార్టీలో కొనసాగుతామని స్పష్టతనిచ్చారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబుని యనమల కృష్ణుడు ఆయన నివాసంలో ఈరోజు కలిశారు. తుని నియోజకవర్గ బాధ్యతలను ఇటీవలే యనమల రామకృష్ణుడి కుమార్తె అయిన యనమల దివ్యకి చంద్రబాబు అప్పగించారు.

తుని ఇంచార్జ్‌గా ఉన్న యనమల కృష్ణుడు.. యనమల దివ్యకి బాధ్యతలు అప్పగించిన రోజు నుంచి అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం జరిగింది. ఇవాళ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, పత్తిపాటి ఇంచార్జ్ వరుపుల రాజా యనమల కృష్ణుడిని చంద్రబాబు వద్దకు తీసుకువచ్చారు. అసంతృప్తి అనే మాటే లేదని యనమల కృష్ణుడు చంద్రబాబుకు వివరించారు. అనంతరం దివ్య తనకు కూతురు లాంటిదని, ఆమె గెలుపు కోసం కృషి చేస్తానని కృష్ణుడు స్పష్టం చేశారు. పార్టీలో తగు ప్రాధాన్యం ఇస్తానని చంద్రబాబు నాయడు ఇచ్చిన హామీ తనకెంతో తృప్తినిచ్చిందన్నారు.

చంద్రబాబు తగు గుర్తింపు ఇస్తారనే నమ్మకం తనకుందని యనమల కృష్ణుడు తెలిపారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ..యనమల కృష్ణుడుని పార్టీ రాష్ట్ర కమిటీలోకి తీసుకుంటున్నట్లు చంద్రబాబు తెలిపారని పేర్కొన్నారు. అన్ని నియోజకవర్గాల్లో యాదవుల ఐక్యతకు కృష్ణుడు కృషి చేస్తారని వర్మ తెలిపారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.