Fear of Corona Virus: కరోనా భయం ఆ కుటుంబాన్ని వెంటాడింది. దీంతో తల్లీకూతుళ్లు రెండేళ్లుగా ఇంటికే పరిమితమయ్యారు. బాహ్య ప్రపంచమనేదే మరిచిపోయారు. ఎవరితోనూ మాట్లాడకుండా నాలుగు గోడల మధ్యే ఉండిపోయారు. ఈ ఘటన కాకినాడ జిల్లా కాజులూరు మండలం కుయ్యేరులో జరిగింది. తల్లి మణి, కుమార్తె దుర్గాభవానికి మానసిక సమస్యలున్నాయి. వీరు మొదటి నుంచి ఇంటి వద్దే ఉంటున్నారు. వీరి ఆలనా పాలన మణి భర్త సూరిబాబు చూసుకుంటున్నారు. కరోనా వచ్చిన తర్వాత తల్లీకూతుళ్లు మరింత భయాందోళనకు గురయ్యారు. ఎవ్వరికీ కనిపించకుండా పూర్తిగా ఇంటికే పరిమితమైపోయారు. వారే ఆహారం తయారు చేసుకుని.. లోపల ఇంటిలోపలే ఎవరికీ కనపడకుండా ఉండిపోయారు. ఏ శుభకార్యాలకూ వెళ్లే వారు కాదు.
ఏళ్లు గడుస్తున్నా ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో గ్రామస్థులు తల్లీకూతుళ్ల ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, వైద్య సిబ్బంది తల్లీకూతుళ్లను బలవంతంగా కాకినాడ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఇవీ చదవండి: