గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం కందులవారిపాలెంలో ఆధికార పార్టీకి చెందిన నాయకులు దాడి చేసి బెదిరిస్తున్నారని అక్కడి దళితులు వాపోతున్నారు. తమను చంపుతామని బెదిరిస్తున్నారని, వారి నుంచి ప్రాణరక్షణ కల్పించాలని కోరుతూ.. సోమవారం సాయంత్రం గుంటూరు కలెక్టరేట్, ఎస్పీ కార్యాయాల్లో అధికారులకు విజ్ఞప్తి చేశారు.
ఎన్నికల్లో ఓడిన వర్గం దళితులపై దాడి..
ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థి వర్గానికి చెందినవారు.. ఓడిపోయిన అభ్యర్థి వర్గంలోని తమపై దాడి చేసి ఇష్టమొచ్చినట్లుగా కొట్టి, దుర్భషలాడుతున్నారన్నారు. గ్రామంలో ఉండనీయకుండా దాడి చేస్తున్నారని పేర్కొన్నారు. భయంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సత్తెనపల్లిలో పోలీసు అధికారులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు తక్షణం స్పందించాలని.. కనీసం ఇళ్ల వద్ద ఉన్న కుటుంబ సభ్యలు యోగక్షేమాలను సైతం తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నామని ఆవేదన చెందుతున్నారు.
ఇదీ చదవండి: