ETV Bharat / state

వైకాపా రెబల్​ అభ్యర్థిపై దాడి.. బాధితుడి అనుచురల ఆందోళన

author img

By

Published : Feb 11, 2021, 9:03 PM IST

గుంటూరు జిల్లా పాల్వాయిలో వైకాపా రెబల్ అభ్యర్థి కోటిరెడ్డిపై ప్రత్యర్థి వర్గం దాడి చేసింది. నిందితులపై చర్యలు తీసుకోవాలంటూ బాధితుడి అనుచరులు ఆందోళనకు దిగారు.

attack on ysrcp rebel candidate
వైకాపా రెబల్​ అభ్యర్థిపై దాడిని నిరసిస్తూ రాస్తారోకో..

గుంటూరు జిల్లా రెంటచింతల మండలం పాల్వాయిలో... వైకాపా రెబల్ నాయకుడు కోటిరెడ్డిపై ప్రత్యర్థి వర్గం దాడికి పాల్పడింది. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్​గా కోటిరెడ్డి నామినేషన్ వేశారు. వైకాపాలోని మరో వర్గం కోటిరెడ్డిని నామినేషన్ ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తెచ్చింది.

కోటిరెడ్డి అందుకు అంగీకరించలేదని మరో వర్గం అతనిపై దాడికి పాల్పడడంతో తీవ్రంగా గాయాలపాలయ్యాడు. చికిత్సకోసం అతడిని వెంటనే పిడుగురాళ్ల ఆసుపత్రికి తరలించారు. దాడికి నిరసనగా పాల్వాయి జంక్షన్​లో అతని అనుచరుల రాస్తారోకోకు దిగారు. దాడికి పాల్పడిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఉదాసీనంగా ఉండటం వల్లే దాడి జరిగిందని కోటిరెడ్డి వర్గం ఆరోపిస్తోంది.

ఇదీ చదవండి:

గుంటూరు జిల్లా జైలు నుంచి పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.