వైకాపా ప్రభుత్వం బీసీ సామాజిక వర్గానికి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన సందర్బంగా నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక వైకాపా కార్యాలయం నుంచి పల్నాడు రోడ్డులోని మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహం వరకూ ర్యాలీ జరిగింది. కార్యక్రమంలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలోని బీసీ సామాజిక వర్గానికి పెద్దపీట వేశారని మోపిదేవి వెంకటరమణ అన్నారు. ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలో బీసీలకు ఒక గుర్తింపు తెచ్చిన ఘనత వైకాపా ప్రభుత్వానిదేనని ఆయన కొనియాడారు. ఎన్నికల ముందు ఎంతోమంది నాయకులు ఎన్నో వాగ్ధానాలు చేస్తుంటారని.. కానీ సీఎం జగన్ ఇచ్చిన హామీని నెరవేర్చారని ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల కోసం రూ. కోటి ప్రోత్సాహకం: సీఎం జగన్