ETV Bharat / state

YSRCP Government Neglecting Inter Education: పాఠాలు బోధించటానికే అధ్యాపకులే లేరు.. - Govt Inter Collegs In AP

YSRCP Government Neglecting Inter Education: రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల పరిస్థితి అధ్వానంగా తయారైంది. కళాశాలల్లో విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు బోధన సిబ్బంది లేకపోయినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. రాష్ట్రంలోని 84 ప్రభుత్వ కళాశాలలకు రెగ్యులర్‌ అధ్యాపక పోస్టులే లేకపోగా.. ఒప్పంద, అతిథి అధ్యాపకులతోనే బోధన కొనసాగుతోంది. అంతేకాకుండా ప్రిన్సిపాల్‌ నుంచి ఆర్జేడీ వరకు ఇన్‌ఛార్జ్‌లతోనే ప్రభుత్వం కాలం వెళ్లదీస్తోంది.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Aug 12, 2023, 10:01 AM IST

YSRCP_Government_Neglecting Inter_Education: పాఠాలు_బోధించటానికే_అధ్యాపకులే_లేరు

YSRCP Government Neglecting Inter Education: విద్యార్థి దశలో కీలకమైన ఇంటర్‌ విద్యను ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసింది. మన పిల్లలను ప్రపంచ స్థాయికి తీసుకుపోవాలన్నది లక్ష్యమని, ఐటీ నిపుణులు, కంపెనీల ప్రతినిధులుగా నిలబెట్టాలన్నది ఆశయమని ఊదరగొట్టిన జగన్‌ ఇంటర్‌ విద్యావ్యవస్థను ఉద్ధరించిందేమీ లేదు. అసలు విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు అధ్యాపకులనే నియమించడం లేదు.

‍"ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పులను ఒడిసి పట్టుకోలేకపోతే పాశ్చాత్య దేశాల పిల్లల మాదిరిగా మన పిల్లలు సమాధానాలు చెప్పగలిగే స్థితిలో ఉండరు. పిల్లలను ప్రపంచ స్థాయికి తీసుకుపోవాలన్న లక్ష్యంతో పని చేస్తున్నాం. ఐటీ నిపుణులు, కంపెనీ ప్రతినిధులుగా నిలబెట్టాలన్నది మా అశయం." అని జులై 20న విద్యాశాఖ సమీక్షలో సీఎం జగన్‌ అన్నారు. కానీ క్షేత్రస్థాయి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.

Intermediate Free Books Distribution: ఉచిత పుస్తకాల పంపిణీ బటన్ నొక్కు జగన్​ మామయ్య..!

ప్రిన్సిపాళ్ల నుంచి ప్రాంతీయ సంయుక్త సంచాలకుల వరకు ఇన్‌ఛార్జ్‌లే: ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల పరిస్థితి అధ్వానంగా తయారైంది. ప్రపంచ స్థాయికి విద్యార్థులకు తీసుకెళ్లటం మాట పక్కన పెడితే.. విద్యార్థులకు పాఠాలు భోదించటానికి.. కనీసం అధ్యాపకులను కూడా నియమించడం లేదు. కళాశాలల్లో పాఠాలు చెప్పే బోధనా సిబ్బంది లేకపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రిన్సిపాళ్ల నుంచి ప్రాంతీయ సంయుక్త సంచాలకుల వరకు.. ఇన్‌ఛార్జ్‌లతోనే ప్రభుత్వం నెట్టుకొస్తోంది.

కళాశాలల్లో అధ్యాపకుల లేమి: రాష్ట్రంలో ఉన్న 476 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో.. లక్షా 21 వేల 180మంది విద్యార్థులు ఇంటర్​ విద్యను అభ్యసిస్తున్నారు. ఇందులో 84 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలకు రెగ్యులర్‌ లెక్చరర్ల పోస్టులే లేవు. 54 కళాశాలలకు, కేవలం ప్రిన్సిపాల్‌ పోస్టులు మాత్రమే ఇచ్చారు. అన్ని కళాశాలల్లో కలిపి మొత్తం 6వేల 116 పోస్టులు ఉంటే ఇందులో పని చేస్తున్న రెగ్యులర్‌ లెక్చరర్లు కేవలం 2వేల 10 మంది మాత్రమే. పాఠాలు చెప్పే అధ్యాపకులే దిక్కులేదంటే.. జగన్ మాత్రం కృత్రిమ మేథ, పాశ్చాత్య దేశాలతో పోటీ, కేంబ్రిడ్జి, ఆక్స్‌ఫర్డ్‌ విధానాలు పాటించాలంటూ భీకర ప్రసంగాలు చేస్తున్నారు.

Inter Students Dharna: సమస్యల పరిష్కారానికి ఎన్టీఆర్​ కలెక్టరేట్ ఎదుట ఇంటర్ విద్యార్థుల ధర్నా

ఇంటర్‌ విద్యాశాఖ సూచనలను పట్టించుకోని ప్రభుత్వం: రాష్ట్రంలో 84 జూనియర్‌ కళాశాలలకు రెగ్యులర్‌ పోస్టులను మంజూరు చేయాలని.. ఇంటర్‌ విద్యాశాఖ కోరుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. ఫలితంగా ఇక్కడ అతిథి, ఒప్పంద అధ్యాపకులే పాఠాలు బోధిస్తున్నారు. 50 కళాశాలలకు ప్రిన్సిపాల్‌ పోస్టూ లేదు. వీటికి ఓ సీనియర్‌ రెగ్యులర్‌ లెక్చరర్‌ను నియమించి అతడి పర్యవేక్షణలో ఒప్పంద, అతిథి అధ్యాపకులతో పాఠాలు చెప్పిస్తున్నారు. పోస్టుల మంజూరు లేనందున ఒప్పంద అధ్యాపకులు ఇక్కడ పని చేసేందుకు ఇబ్బంది పడుతున్నారు.

ఆగిపోయిన అధ్యాపక భర్తీలు: ప్రభుత్వం ఒప్పంద లెక్చరర్లను క్రమబద్ధీకరిస్తే ఇక్కడ పని చేసేవారికి ఆ అవకాశం ఉండడం లేదు. జీతాలకూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఎక్కువ మంది అతిథి అధ్యాపకులే పాఠాలు బోధిస్తున్నారు. వీరికి గంటకు 150 చొప్పున నెలకు 10వేల రూపాయలకు మించకుండా చెల్లించాలనే నిబంధన ఉంది. జూన్‌ నుంచి వీరు పాఠాలు బోధిస్తున్నా ఇంత వరకూ వారికి జీతాలు ఇవ్వలేదు.

పోస్టులు భర్తీ చేయలేని కళాశాలల్లో అన్నింటికి ఇన్‌ఛార్జిలే దిక్కుగా మారింది. రాష్ట్రంలో 210 కళాశాలలకు ప్రిన్సిపాళ్లే లేరు. కొన్నిచోట్ల సీనియర్‌ లెక్చరర్‌ ఇన్‌ఛార్జిగా ఉండగా.. 50 కళాశాలలకు అసలు ప్రిన్సిపల్‌ పోస్టులే మంజూరే కాలేదు. ఇక్కడ పక్క కళాశాల లెక్చరర్‌ను నియమించి.. పర్యవేక్షణ చేయిస్తున్నారు.

Inter Results: ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పడిపోయిన ఉత్తీర్ణతా శాతం..

ఇన్‌ఛార్జిలతోనే కాలం వెల్లదీత: ప్రభుత్వ కళాశాలల్లో తనిఖీలు చేసేందుకు జిల్లాకో వృత్తి విద్యాధికారి ఉండాల్సి ఉన్నా.. ప్రస్తుతం 26 జిల్ల్లాల్లోనూ ప్రిన్సిపాళ్లే ఇన్‌ఛార్జిలుగా కొనసాగుతున్నారు. అటు డీవీఈఓగా ఇటు ప్రిన్సిపల్‌గా రెండు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కళాశాలలో జీతాల బిల్లులు, ఇతరత్రా ఆర్థిక సంబంధ వ్యవహారాలు ప్రిన్సిపల్‌ చూస్తుండగా.. మిగతా నిర్వహణ బాధ్యతలను సీనియర్‌ లెక్చరర్లకు అప్పగిస్తున్నారు.

ప్రైవేటు కళాశాలల పర్యవేక్షణ, ఇంటర్‌ విద్యా మండలి తరపున పరీక్షల నిర్వహణ బాధ్యతలను చూసేందుకు జిల్లాకు ఒక ప్రాంతీయ తనిఖీ అధికారి ఉంటారు. ప్రస్తుతం వీరు ఉమ్మడి 13 జిల్లాలకు మాత్రమే ఉండగా.. ప్రిన్సిపాళ్లే ఈ పోస్టులో ఇన్‌ఛార్జిలుగా పని చేస్తున్నారు. కడప, గుంటూరు, రాజమహేంద్రవరంలో ప్రాంతీయ సంయుక్త సంచాలకులు పోస్టులు ఉన్నాయి. వీటిని ఇన్‌ఛార్జిలతోనే కొనసాగిస్తున్నారు. అందరికంటే సీనియర్‌ ప్రిన్సిపాల్‌ను ఆర్జేడీలుగా నియమించారు. ఇంటర్మీడియట్‌ విద్యలో అదనపు డైరెక్టర్‌ పోస్టు ఉండగా.. దీన్ని పాఠశాల విద్యకు చెందిన వారిని నియమించారు.

బస్టాండ్​​లో పెళ్లి చేసుకున్న పాఠశాల​ విద్యార్థుల వీడియో వైరల్​

ఇంటర్​ కళాశాలకు తగ్గిపోతున్న ప్రవేశాలు: ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరచేందుకు కృషి చేస్తున్నామని సర్కారు చెబుతున్నా.. అవి మాటలకే పరిమితమవుతున్నాయి. ప్రభుత్వం జూనియర్‌ కళాశాలలకు సమాంతరంగా పాఠశాల విద్యాశాఖ.. హైస్కూల్‌ ప్లస్‌లో ఇంటర్మీడియట్‌ ప్రారంభించింది. గతేడాది 272 హైస్కూల్‌ ప్లస్‌లో ఇంటర్మీడియట్‌ ప్రవేశపెట్టగా వచ్చే ఏడాది కో-ఎడ్యుకేషన్‌ ఇంటర్మీడియట్‌ను 205 బడుల్లో తీసుకురాబోతున్నారు. దీంతో ప్రభుత్వ కళాశాలలకు వచ్చే ప్రవేశాలు తగ్గిపోతున్నాయి. పదో తరగతి ఉత్తీర్ణులైన వారు అక్కడే ఉండిపోతున్నారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఏటా ప్రవేశాలు తగ్గుతున్నాయి. గతంలో రెండు లక్షల వరకు ఉండే విద్యార్థుల సంఖ్య ఇప్పుడు లక్షా 20వేలకే పరిమితమైంది.

ఇంటర్​ కళాశాలల్లో మధ్యాహ్న భోజనంపై వైసీపీ ప్రభుత్వ కడుపుమంట: తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఇంటర్మీడియట్‌ విద్యార్థుల కోసం తీసుకొచ్చిన మధ్యాహ్న భోజన పథకాన్ని వైసీపీ ప్రభుత్వం నిలిపివేసింది. గ్రామీణ, మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు కళాశాల పూర్తైన తర్వాత వెంటనే ఇళ్లకు వెళ్లే పరిస్థితి ఉండదు. దీంతో వారు ఆకలితో అలమటించాల్సి వస్తోందని మధ్యాహ్న భోజనం పథకాన్ని గత ప్రభుత్వం తీసుకొచ్చింది. వైసీపీ అధికారంలోకి రాగానే దీన్ని రద్దు చేసింది. దీనికి తోడు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీని నిలిపివేసింది. ఫలితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద విద్యార్థులపై సర్కారు ఆర్థిక భారం మోపింది. కేవలం 10కోట్ల రూపాయల నిధులు ఇచ్చేందుకు సీఎం జగన్‌కు చేతులు రావడం లేదు.

ఉన్నత విద్యా కోర్సుల్లో రికార్డు స్థాయిలో ప్రవేశాలు పెరిగాయి: మంత్రి బొత్స

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.