ETV Bharat / state

రంగులు మార్చారు... లక్ష్యాన్ని మరిచారు - ysr sujala sravanthi project in vinukonda

‘ప్రతి ఇంటికీ రక్షిత నీరు.. అందరికీ ఆరోగ్యం’ నినాదంతో శుద్ధజలం అందించేందుకు క్లస్టర్‌ బేస్‌డ్‌ ఆర్వో ప్లాంట్లు మంజూరయ్యాయి. హబ్‌ అండ్‌ స్పోక్స్‌ పద్ధతిలో ప్రధాన గ్రామంలో మదర్‌ ప్లాంటు ఏర్పాటు చేసి అక్కడి నుంచి చుట్టుపక్కల సుమారు 13 కి.మీ. దూరం ట్యాంకర్లతో నీరందించేందుకు ప్రణాళిక తయారు చేశారు. వినుకొండ నియోజకవర్గంలో మూడింటికి నిధులు మంజూరు కాగా ఒకటి పూర్తయింది. నూతన ప్రభుత్వంలో దానికి రంగులు మార్చి నిరుపయోగంగా ఉంచారు. మిగిలిన రెండింటికీ స్థల సేకరణ, బోర్లు వేశాక వాటిని రద్దు చేశారు. ఫ్లోరైడ్‌ ప్రాంతంలో సురక్షిత నీరు అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు.

ysr sujala sravanthi scheme is not implemented
పెదకంచర్లలో మదర్‌ యూనిట్‌ (పాతచిత్రం)
author img

By

Published : Sep 29, 2020, 8:00 PM IST

రాష్ట్రంలో ఫ్లోరైడ్‌ పీడిత ప్రాంతాల్లో వినుకొండ ఒకటి. ఇక్కడి ప్రజలు బోర్లు, బావుల నీరు తాగి కాళ్లు, చేతులు వంకర్లు తిరిగి తక్కువ వయసులోనే అనారోగ్యం పాలవుతున్నారు. ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం 2018లో సాముదాయక ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసి శుద్ధజలం అందించాలని నిర్ణయించింది. రూ.2కే 20 లీటర్లు అందించేందుకు నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రిమోట్‌ డిస్పెన్సరీ యూనిట్‌ (ఆర్‌డీయూ)ల ద్వారా ఏటీఎం తరహాలో కార్డు పెట్టి నీరు పట్టుకునేందుకు అవకాశం కల్పించారు. తొలి విడతలో రాజధాని ప్రాంతంలో ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ సాంకేతిక సహకారంతో ఏర్పాటు చేసి విజయవంతం కావడంతో జిల్లాలోని చిలకలూరిపేట, పొన్నూరుతో పాటు వినుకొండలో వాటిని ఏర్పాటు చేసేందుకు అనుమతించారు.

పనులు పూర్తయినా..

వినుకొండ మండలం పెదకంచర్లలో రూ.2.20 కోట్లతో నిర్మించే యూనిట్‌కు పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ నిధులు మంజూరు చేసింది. ఇందుకు అవసరమైన ఎకరం స్థలంలో మదర్‌ ప్లాంటు ఏర్పాటు చేశారు. బోర్లు వేసి నీటి పరీక్షలు చేసి కనెక్షన్‌ ఇచ్చారు. అక్కడ నుంచి చుట్టుపక్కల 24 ఆవాస ప్రాంతాలకు నీటిని సరఫరా చేసేందుకు నాలుగు ట్రాక్టర్‌ మౌంటెడ్‌ ట్యాంకర్లు సిద్ధంగా ఉంచారు. నీళ్లు పట్టుకునేందుకు వీలుగా 16 గ్రామాల్లో ఆర్‌డీయూలు ఏర్పాటు చేస్తారు. ఏడాది గడిచినా రంగులు మార్చారు తప్ఫ. ఇప్పటి వరకు వినియోగంలోకి తేలేదు. నాడు ఎన్టీఆర్‌ సుజల పథకం పేరుతో ఉన్న బోర్డులు తొలగించి వైఎస్సార్‌ సుజల సురక్షిత మంచినీటి పథకంగా పేరు పెట్టారు. అధికార యంత్రాంగం శ్రద్ధ పెట్టి ఇప్పటికైనా శుద్ధజలం సరఫరాకు చర్యలు తీసుకోవాలని ఆయాగ్రామాల వారు కోరుతున్నారు.

రద్దుల పద్దు

వినుకొండ మండలంలోని 42 నివాస ప్రాంతాలకు పైతరహాలోనే తాగునీరందించేందుకు రూ.3.30 కోట్లు మంజూరయ్యాయి. తిమ్మాయిపాలెం సమీపంలో మదర్‌ప్లాంటు ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని సేకరించి బోరు వేసి నీటి పరీక్షలు పూర్తి చేశారు. తర్వాత రద్దు చేశారు. నూజండ్లలో రూ.3.90 కోట్లతో ప్లాంటు ఏర్పాటు చేసేందుకు స్థలం కేటాయించారు. చుట్టుపక్కల సుమారు 61 నివాస ప్రాంతాలకు ఇక్కడ నుంచి నీటిని అందించాలని నిర్ణయించారు. సుమారు 45 వేల మందికి ప్రయోజనం కలిగే ఈ కార్యక్రమాన్ని నిలిపేశారు. ఈపూరు, బొల్లాపల్లిలో ప్రతిపాదనల దశలోనే ఆగిపోయాయి.

త్వరలో వినియోగంలోకి తెస్తాం

పెదకంచర్ల పథకం పనులకు సంబంధించిన బిల్లులు ప్రభుత్వానికి వెళ్లాయి. వాటిని ఆమోదించాక వినియోగంలోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తాం. నిధుల లభ్యత లేక మిగిలినవి రద్దు అయ్యాయి. - సురేష్‌కుమార్‌, డీఈఈ, గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం

ఇదీ చదవండి :

గాలేరు-నగరి సుజల స్రవంతి పనులకు శంకుస్థాపన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.