ETV Bharat / state

అమ్మాయిలను చదివిస్తేనే.. సమాజం బాగు పడుతుంది: సీఎం జగన్

author img

By

Published : Feb 10, 2023, 4:57 PM IST

YSR Kalyanamasthu, YSR Shaadi Tohfa: వైఎస్ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా లబ్ధిదారులకు బటన్ నొక్కి సీఎం జగన్‌ నిధులను విడుదల చేశారు. ఎస్టీలు, ఎస్సీలు, మైనార్టీలకు రూ.1 లక్ష... బీసీ వధూవరులకు రూ.50 వేలు ఆర్థికసాయం విడుదల చేసినట్లు తెలిపారు. వధూవరులు పదో తరగతి చదివి ఉండాలనే అర్హతను పెట్టినట్లు సీఎం జగన్‌ వెల్లడించారు.

YSR Kalyanamasthu
కళ్యాణమస్తు

YSR Kalyanamasthu, YSR Shaadi Tohfa in AP: వైయస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం నగదు జమ చేసింది. ఈ మేరకు 2022 అక్టోబరు – డిసెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి 4,536 మంది లబ్ధిదారులకు 38.18 కోట్ల రూపాయలను సీఎం జగన్‌ వర్చువల్‌ విధానంలో వారికి జమ చేశారు. అక్టోబరు- డిసెంబర్‌ మధ్య పెళ్లిళ్లు చేసుకున్నవారికి దరఖాస్తు చేసుకోవడానికి ఒక నెలపాటు సమయం ఇచ్చామని సీఎం జగన్‌ తెలిపారు. జనవరిలో తనిఖీ పూర్తిచేసి వధూవరుల ఖాతాలలో నగదు జమ చేశామని సీఎం వెల్లడించారు. ప్రతి త్రైమాసికానికి సంబంధించి ఇదే విధానంలో కార్యక్రమం అమలు చేస్తామన్నారు.

ఈ ప్రోత్సాహకం కోసం కనీసం పదో తరగతి వరకూ చదివి ఉండాలనీ నిర్దేశించినట్లు తెలిపారు. వయసు మాత్రమే కాదు, చదువు సైతం ఒక అర్హతగా ఈ పథకానికి నిర్దేశించామని సీఎం వివరించారు. పిల్లలను చదివించడానికి పెట్టే ప్రతి రూపాయి కూడా ఖర్చుగా భావించడం లేదని తేల్చిచెప్పారు. పెళ్లైనవారే కాకుండా వారి తర్వాత తరాలు సైతం చదువుల బాట పట్టాలనే ఈ ఆలోచన చేస్తున్నట్లు వెల్లడించారు. పిల్లల చదువులను ప్రోత్సహించడం, బాల్యవిహాహాలను నివారించడం, స్కూళ్లలో డ్రాప్‌ అవుట్స్‌ను తగ్గించడమే లక్ష్యంగా ఈ పథకం అమలు చేస్తున్నట్లు సీఎం స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతోపాటు దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికులు, ఆడపిల్లలందరికీ మంచి జరిగేలా ఈ పథకం అమలు చేస్తామన్నారు.

కళ్యాణమస్తు, షాదీ తోఫా లబ్ధిదారులకు ఆర్థికసాయం

వచ్చే త్రైమాసికం నుంచి కళ్యాణమస్తు, షాదీ తోఫా డబ్బులు పెళ్లికూతురు తల్లుల ఖాతాల్లోకి డబ్బులు వేస్తామని సీఎం జగన్ వెల్లడించారు. వివిధ వర్గాల నుంచి వచ్చిన సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు జగన్ తెలిపారు. పెళ్లిళ్ల కోసం కొంతకాలం ఆగొచ్చు కానీ, చదువులు ఆగిపోకూడదన్నదే తమ ఉద్దేశమని సీఎం వివరించారు. అమ్మాయిలు చదువుల బాట పడితేనే సమాజం బాగుపడుతుందన్నారు. గతంలో కూడా ఇలాంటి తరహా కార్యక్రమం ప్రకటించారు... కానీ, అమలు విషయంలో మాత్రం ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గత ప్రభుత్వంలో పథకాలను అమలు చేశారని.. మంచి చేయాలన్న ఆలోచనతో చేసింది కాదన్నారు. గతంలో 2018-19 సంవత్సరంలో 17,709 మంది లబ్ధిదారులకు 68.68 కోట్లు ఎగ్గొట్టారని జగన్ పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.