అనంతరం బాపట్ల డీఎస్పీ మీడియాతో మాట్లాడారు. కాకుమానులో రాజకీయంగా వైకాపా, తెదేపా వర్గీయుల మధ్య గొడవలు ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. గ్రామంలోని చెరువుకు నీరు పెట్టె విషయంలో తరచూ గొడవలు జరుగుతున్నాయన్నారు. పెదనందిపాడు ఎత్తిపోతల పథకానికి ప్రస్తుతం తెదేపా నేతలు కమిటీ సభ్యులుగా ఉన్నారని... అధికారం మారినందున కమిటీలో తమకు అవకాశం ఇవ్వాలని వైకాపా నాయకులు అడిగారన్నారు. ఈ విషయంలో గత రెండు రోజులుగా ఇరు పార్టీల మధ్య చర్చలు నడుస్తున్నాయన్నారు. ఎత్తిపోతల పథకం కమిటీలో స్థానం కల్పించమన్నందుకే తెదేపా నాయకులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు వైకాపా వర్గీయులు ఫిర్యాదు చేశారు. ఈ అంశాలపై విచారణ జరిపి, త్వరలో నిందితులను పట్టుకుంటామని డీఎస్పీ అన్నారు. రెండు పార్టీల నేతలు సంయమనం పాటించాలని కోరారు.
ఇదీ చదవండి :