టిక్ టాక్ మోజులో పడి తూర్పు గోదావరి జిల్లా నుంచి గుంటూరు జిల్లాకు వచ్చిన ఐదుగురు యువకులను మంగళగిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందమైన లోకేషన్లలో వీడియోలు తీసుకునేందుకు కాకినాడ, మాడుగుల, నగరం గ్రామాలకు చెందిన ఐదుగురు యువకులు నాలుగు రోజుల క్రితం ద్విచక్రవాహనాలపై బయలుదేరారు. మార్గమధ్యలో వివిధ లోకేషన్లలో వీడియోలు తీసుకున్నారు.
అయితే ఇది తెలియని తల్లిదండ్రులు తమ పిల్లలు కనిపించడంలేదని తూర్పుగోదావరి జిల్లా నగరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న యువకులను మంగళగిరి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. నగరం పోలీసులకు సమాచారమివ్వగా వాళ్లు వచ్చి యువకులను తూర్పుగోదావరి జిల్లాకు తీసుకెళ్లారు.
ఇదీ చదవండి: చెత్త సేకరణ వృత్తిదారులకు తప్పని పాట్లు