ETV Bharat / state

గుంటారులో యువకుడి ఆత్మహత్య.. కారణం ఇదే? - గుంటూరు జిల్లా ప్రధాన వార్తలు

పురుగుల మందు తాగి ఓ యువకుడు ఆత్మహత్య(suicide) చేసుకున్న ఘటన గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం రావిపాడులో జరిగింది. కొందరి వేధింపులతోనే తన కుమారుడు ప్రాణాలు తీసుకున్నాడని మృతుడి తల్లి తెలిపింది.

రావిపాడులో పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య

author img

By

Published : Oct 31, 2021, 10:06 PM IST

గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. నరసరావుపేట మండలం రావిపాడు గ్రామానికి చెందిన పీటర్‌ పాల్‌ (30) గతంలో ఓ యువతిని తన ఇంటికి తీసుకెళ్లాడు.. ఆమె కుటుంబ పెద్దలు పీటర్ ఇంటికి వచ్చి మాట్లాడి యువతిని తీసుకెళ్లారు. అయితే.. ఆ తర్వాత పీటర్‌పాల్‌ ఫోన్లో యువతికి సంబంధించిన ఫొటోలు ఉన్నాయని, వాటిని తొలగించాలని నరసరావుపేట పోలీసులకు యువతి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.

దీంతో.. పోలీసులు పీటర్‌పాల్‌ను స్టేషన్‌కు పిలిపించి అతని వద్ద ఉన్న సెల్‌పోన్‌ తీసుకున్నారు. అప్పటి నుంచి సెల్‌ఫోన్‌ కోసం ఎన్ని సార్లు స్టేషన్‌కు వచ్చినా.. అధికారులు ఇవ్వకుండా తిప్పుతున్నారని మృతుని తల్లి శాంతమ్మ ఆరోపించారు. ఈ క్రమంలో యువతి బంధువులు, మరి కొందరు తమ ఇంటిపైకి వచ్చి కుమారుడిపై దాడి చేశారని తెలిపింది. వారిలో అధికార పార్టీ నాయకులు ఉన్నారని, దీంతో.. తనను బతకనివ్వబోరని తన కొడుకు ఆందోళకు గురయ్యాడని వివరించింది.

శుక్రవారం స్టేషన్‌కు వెళ్లే సమయంలో చొక్కా మర్చుకుని వస్తానని ఇంట్లోకి వెళ్లిన పీటర్‌.. పురుగుల మందు తాగాడని తెలిపింది. గమనించి వెంటనే స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు.. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించామని, చికిత్స పొందుతూ మృతి చెందాడని పీటర్‌ తల్లి శాంతమ్మ తెలిపారు. ఆత్మహత్య చేసుకునే ముందు తన చావుకు కొనతం రామకోటేశ్వరరావు, రాకింది పెద్ద నాగేశ్వరరావు కారణమని లేఖ రాశాడని వెల్లడించింది.

ఇదీ చదవండి:
"న్యాయస్థానం నుంచి దేవస్థానం" పాదయాత్రకు.. చురుగ్గా రైతుల ఏర్పాట్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.