ETV Bharat / state

యువతి అపహరణ కేసులో నలుగురి అరెస్టు - గుంటూరు జిల్లా వార్తలు

పెదనందిపాడులో ఈ నెల 24న యువతి అపహరణ కేసులో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించనున్నట్లు బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు.

young-girl-kidnapping-four-arrested
యువతి అపహరణ కేసులో నలుగురి అరెస్టు
author img

By

Published : Jul 29, 2021, 10:56 PM IST

గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలంలో యువతి అపహరణ కేసును పోలీసులు ఛేదించారు. యువతిని అపహరించిన నలుగురు నిందితులను అరెస్టు చేశారు.

ఈ నెల 24 న ఇంటి వద్ద ఉన్న యువతిని .. నూతి అశోక్​ అనే వ్యక్తి మరో ముగ్గురు వ్యక్తులు కల్యాణ చక్రవర్తి, శ్రీనివాసరావు, కోటమ్మ సహకారంతో కారులో బలవంతంగా ఎక్కించి అపహరణ చేశారని బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. యువతిని గుంటూరు మీదుగా హైదరాబాద్ తీసుకెళ్లి... తిరిగి గుంటూరులో వదిలిపెట్టారని వెల్లడించారు.

అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడైన నూతి అశోక్​పై..బాధితురాలు గతంలో ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిందని తెలిపారు. ఎస్సీ ఎస్టీ కేసు మాఫీ చేయించాలని ఆ యువతిని బెదిరించేందుకు కిడ్నాప్​ చేశారని డీఎస్పీ వెల్లడించారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్​కు పంపిస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి: తాడేపల్లిలోని ఆ ఇంట్లో.. రెండు మృతదేహాలు ఎవరివి..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.