ఉద్యాన పంటల సాగు అభివృద్ధికి కృషి చేస్తున్నందుకుగాను గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలానికి చెందిన ఓ యువ రైతుకు ప్రతిష్టాత్మక రామ్ నందన్ బాబు అవార్డు వరించింది. బలుసుల పాలెం గ్రామానికి చెందిన కొనకాల రవికిరణ్ ఉద్యానవన పంటలు సాగు చేస్తుంటారు. ఆయన కన్సడరేషన్ హార్టికల్చరల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సభ్యునిగా పని చేస్తున్నారు. ఈ అసోసియేషన్‌లో దేశవ్యాప్తంగా 28 మంది ఉండగా ఏపీ నుంచి రవి కిరణ్ ఒక్కరే 2015లో నామినేట్ అయ్యారు.
కొబ్బరి, మామిడి తోటల సాగు, అభివృద్ధికి కృషి చేసినందుకు గుర్తింపుగా 2020-21 సంవత్సరానికి రామ్ నందన్ బాబు అవార్డు రవి కిరణ్‌ను వరించింది. హైదరాబాదులోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఈనెల 16 నుంచి 18 వరకు నిర్వహించిన భారతదేశ వ్యవసాయ ఉద్యాన శాఖ సదస్సులో.. ప్రపంచ ప్రఖ్యాత ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ హరిశ్చంద్రప్రసాద్ సింగ్, విశ్రాంత వ్యవసాయ శాఖ కార్యదర్శి శోభన్ పట్నాయక్ చేతుల మీదుగా రవికిరణ్ ఈ అవార్డును అందుకున్నారు.
ఇదీ చదవండి : BJP: వైకాపా పాలన అంతా అవినీతి, అప్పులమయం: భాజపా