ETV Bharat / state

కృష్ణానదిలో స్నానానికి దిగిన యువకుడు.. నీటి ఉద్ధృతి కారణంగా మృతి - man died in krishna river at Sitanagaram Pushkara Ghat

మిత్రులతో కలిసి స్నానం కోసం కృష్ణానదిలోకి దిగిన ఓ యువకుడు.. నీటి ఉద్ధృతి కారణంగా మృతి చెందారు. మిగిలిన వారు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి సీతానగరంలో జరిగింది.

man died
యువకుడు మృతి
author img

By

Published : Aug 20, 2021, 7:46 PM IST

గుంటూరు జిల్లా తాడేపల్లి సీతానగరంలో విషాదం జరిగింది. గుంటూరుకు చెందిన నలుగురు యువకులు సీతానగరం వద్ద పుష్కర ఘాట్​లో స్నానానికి కృష్ణానదిలోకి దిగారు. నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో ఇద్దరు యువకులు వెంటనే బయటకు వచ్చారు. మిగిలిన ఇద్దరు యువకుల్లో ఒకరైన నవీన్​ గల్లంతు కాగా.. మరొకరు క్షేమంగా బయటకు వచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు.. గజ ఈత గాళ్ల సహాయంతో గాలించారు. నవీన్ మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండీ... చేపల చెరువులో దేవతామూర్తుల విగ్రహాలు.. రంగంలోకి పురావస్తు అధికారులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.