గుంటూరుకు చెందిన సైదాబీకి అమరావతి మండలం లేమల్లెకు చెందిన షేక్ ఇమామ్ వలీతో 30 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. కుమారుడు మస్తాన్వలీ ఏడో తరగతి చదివాడు. ఇమామ్ వలీ, సైదాబీ కుర్చీలు తయారు చేస్తుంటారు. వ్యాపార నిమిత్తం తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా తొర్రూరులో జీవిస్తున్నారు. కొన్ని నెలల కిందట మేడికొండూరులోని బంధువుల ఇంటికి వచ్చారు. లాక్ డౌన్ కారణంగా ఇక్కడే చిక్కుకుపోయారు.
మంగళవారం ఉదయం మస్తాన్వలీ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఎంత సేపటికీ తిరిగి రాకపోవటంతో అనుమానం వచ్చి బంధువులు వెతుకుతుండగా... గ్రామంలోని తాగునీటి చెరువు వైపు వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. కుటుంబసభ్యులు వెళ్లి పరిశీలించగా యువకుడి చెప్పులు చెరువు కట్టపై కనిపించాయి. చెరువులో పడి ఉంటాడని భావించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. గజ ఈతగాళ్ల సాయంతో చెరువులో వెతికించగా...వలీ శవమై కనిపించాడు. మస్తాన్వలీ మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
ఇదీ చదవండి:
పల్నాడులో మళ్లీ ఉద్రిక్తత: గుంటూరు జిల్లాలో తెదేపా నేతపై దాడి