YCP MLA CHEVIREDDY MET SHARATH CHANDRAREDDY : సంచలనం సృష్టించిన దిల్లీ మద్యం కుంభకోణం కేసులో నిందితుడైన శరత్ చంద్రారెడ్డిని.. వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కలిశారు. రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ అనంతరం శరత్ చంద్రారెడ్డితో చెవిరెడ్డి భేటి అయ్యారు. అయితే శరత్‌చంద్రారెడ్డిని చెవిరెడ్డి కలవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రస్తుతం మద్యం కుంభకోణం కేసులో శరత్ చంద్రారెడ్డి విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. తాజాగా రౌస్ అవెన్యూ కోర్టు.. శరత్ చంద్రారెడ్డి, బినోయి బాబుకు 14 రోజుల కస్టడీని విధించింది.
ఇవీ చదవండి: