గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో వైకాపా కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి జయంతి సందర్భంగా ప్రధాన కూడలిలో బాణసంచా కాల్చుతూ హడావిడి సృష్టించారు. అటుగా వెళ్తున్న లారీ కింది భాగంలో టపాసులు పేలడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రాష్ట్ర హోంమంత్రి సుచరిత నియోజకవర్గంలోనే ఈ ఘటన జరగడం గమనార్హం. విషయం తెలుసుకున్న పోలీసులు.. కార్యకర్తలను స్టేషన్కు తరలించి విచారిస్తున్నారు.
ఇదీచదవండి. : కరోనా ఎఫెక్ట్: మార్కెట్ లేక కూరగాయల రైతుల కష్టాలు