గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు సొంత పార్టీ నేత నుంచి వ్యతిరేకత ఎదురైంది. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన అంబటిని.. రాజుపాలెం మండలం కొండమోడుకు చెందిన వైకాపా నేత వేముల కాశీ విశ్వనాథం అడ్డుకున్నాడు. ఎమ్మెల్యే కారుకు తన కారు అడ్డంపెట్టాడు.
తమ గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కరించడం లేదని నిలదీశాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కనీసం స్పందించడం లేదని ఆరోపించారు. ఎన్నికల సమయంలో వచ్చి మద్దతు అడిగి.. ఇప్పుడు ముఖం చాటేస్తున్నారన్నారు. అయితే అతను మద్యం మత్తులో ఉండటంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారును, అతడిని స్టేషన్కు తరలించారు.
ఇవీ చదవండి..