ETV Bharat / state

సత్తెనపల్లి: అధికార పార్టీలో మరోసారి బయటపడ్డ విభేదాలు - సత్తెనపల్లి వార్తలు

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో అధికార పార్టీలో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. సత్తెనపల్లిలో నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్స్​ఫార్మర్ ఏర్పాటు చేస్తున్నారంటూ...స్థానిక వైకాపా నేత రోడ్డుపై ఆందోళకు దిగారు.

ycp Leader agitation in Sattenapalli
రోడ్డుపై ఆందోళకు దిగిన వైకాపా నేత
author img

By

Published : Oct 27, 2020, 2:15 PM IST

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో వైకాపా నాయకుడు రోడ్డుపైన నిరసనకు దిగటం అధికార పార్టీలో లుకలుకల్ని బహిర్గతం చేసింది. సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వెనుక వైపు ప్రాంతంలో ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు ఈ వివాదానికి దారితీసింది. నిబంధనలకు విరుద్ధంగా అక్కడ ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేస్తున్నారని వైకాపా నేత ఆతుకూరి నాగేశ్వరరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. పనులను కాసేపు అడ్డుకున్నారు. దీంతో విద్యుత్ శాఖ అధికారులు విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. కాసేపటి తర్వాత నాగేశ్వరరావు ఆందోళన విరమించారు.

గతంలో తెదేపాలో ఉన్న నాగేశ్వరరావు... సత్తెనపల్లి మున్సిపల్ వైస్ ఛైర్మన్​గా కూడా పనిచేశారు. ఎన్నికల ముందు వైకాపాలో చేరారు. ప్రస్తుతం సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుతో విభేదాలు వచ్చిన కారణంగానే ఆయన రోడ్డుపై ఆందోళనకు దిగినట్లు తెలుస్తోంది. లైన్ మెన్ పోస్టుల నియామకం విషయంలో తాను సూచించిన వారికి రాకపోవటంతో నాగేశ్వరరావు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.

ఇదీ చదవండి:

స్థానిక ఎన్నికలపై అభిప్రాయాల వెల్లడికి ఆహ్వానం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.