గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలంలో వైకాపాలో అసంతృప్తి నెలకొంది. ఎంపీపీ పదవి పోరులో వైకాపా నాయకులు రెండు వర్గాలుగా చీలిపోయారు. మండల కన్వీనర్ వాసు వర్గానికి ఎంపీపీ పదవి ఇస్తారని విషయం తెలియడంతో.. ఎంపీటీసీ కల్లూరి నాగేశ్వరరావు వర్గం వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీపీ పదవి చెల్లి లక్ష్మీకి ఇవ్వాలని కోరుతూ ఆందోళన చేశారు. రెండు వర్గాలు ఎంపీపీ పదవి కోసం పట్టు పట్టాయి. చెల్లి లక్ష్మికి ఎంపీపీ పదవి ఇవ్వకపోతే ఎంపీటీసీ, జడ్పీటీసీ పదవులకు రాజీనామా చేస్తామని కల్లూరి నాగేశ్వరరావు, సతీమణి అన్నపూర్ణ తెలిపారు. ఆందోళనలో ఎంపీటీసీ చెల్లి లక్ష్మీ సొమ్మసిల్లి పడిపోయారు.
ఇదీ చదవండి: జీజీహెచ్ కాన్పుల వార్డులో పాము కలకలం.. పరుగులుతీసిన బాలింతలు..!